మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన


Sun,July 21, 2019 01:38 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జూలై 20 : ని రుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కో సం జిల్లా గ్రామీణాభివృద్ది, ఈజీఎంఎం ద్వారా వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు సహకారంతో ఎమ్మెల్యే అరూరి ర మేశ్ శనివారం ఏర్పాటు వర్ధన్నపేటలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసి ఈ శిబిరానికి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుంచి సుమారు ఆరు వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు.
నిరుద్యోగులు మండలాల వారీగా వారి పేర్లను తొలుతగా నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక హాల్‌లో మేళాకు హా జరై 36 కంపెనీలకు చెందిన ప్రతినిధులు నిరుద్యోగులను ఇంటర్వ్యూలు చేశారు. రాష్ట్రంలో పేరుగాంచిన కంపెనీలతో పాటుగా నిరుద్యోగులకు శిక్షణను ఇచ్చే 12 కంపెనీల ప్రతినిధులు కూడా మే ళాకు హాజరయ్యారు. ఉద్యోగాలు సాధించినవారు నేరుగా కంపెనీలకు వెళ్లేలా జాబ్ అపాయింట్‌మెంట్‌లను కూడా ఆయా కంపెనీల ప్రతినిధులు అందజేశారు. అలాగే మేళాలో కంపెనీల ప్రతినిధులు వారి కంపెనీలకు సంబంధించిన వివరాలను సమగ్రంగా సమావేశంలో తెలియజేసి వారి కేంద్రానికి కేటాయించిన నంబర్‌లను కూడా తెలియజేశారు. దీంతో నిరుద్యోగులు వారికి ఆసక్తి, అర్హతలున్న కంపెనీల కేంద్రాలకు వెళ్లి ఇంటర్వ్యూలు పూర్తి చేశారు.

ఏజీఎఫ్ ద్వారా భోజన వసతి
ఎమ్మెల్యే అరూరి రమేశ్ నిర్వహిస్తున్న అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ (ఏజీఎఫ్) ద్వారా నిరుద్యోగులకు భోజన వసతిని కల్పించారు. మండల కేంద్రంలోని ఎంఎంఆర్, ఏబీఎస్ ఫంక్షన్‌హాల్‌లలో ప్రత్యేకంగా భోజన సవతిని ఏర్పాటు చేశా రు. నిరుద్యోగులు పేర్లను నమోదు చేసుకునే చోట నే భోజనానికి సంబంధించిన కూపన్‌లను కూడా నిర్వాహకులు అందజేశారు. దీంతో నిరుద్యోగులు సమావేశం పూర్తికాగానే భోజనాలు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేసుకున్నారు. కాగా, నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలతో పాటుగా వి లీన గ్రామాలకు చెందిన నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున జాబ్‌మేళాకు హాజరయ్యారు. ఈ జాబ్‌మేళా ద్వారా సుమారు మూడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. లక్ష్మీ గార్డెన్స్‌కు పెద్ద సం ఖ్యలో నిరుద్యోగులు రావడంతో గార్డెన్స్ ఆవరణ కిక్కిరిసిపోయింది

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...