మున్సిపల్ పోలింగ్ స్టేషన్ తుది జాబితా విడుదల


Mon,July 22, 2019 01:29 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జూలై 21 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట, తండాల పరిధిలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ స్టేషన్‌ల తుది జాబితాను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 1,2,3 పోలింగ్ కేంద్రాలను పుస్కోస్ పాఠశాలలో, 4,5,6,7 పోలింగ్ కేంద్రాలను డీసీతండా ప్రాథమికోన్నత పాఠశాలలో, 8,9 పోలింగ్ కేంద్రాలను గుబ్బెటితండా ప్రాథమిక పాఠశాలలో, 10వ పోలింగ్ కేంద్రాన్ని ఎంపీపీఎస్ వర్ధన్నపటలో 11 పుస్కోస్ ఉన్నత పాఠశాలలో, 12, 13, 14, 15 వర్ధన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన తుది జాబితాను కార్యాలయ ఆవరణలో నోటీసు బోర్డుపై అతికించినట్లు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాల మేరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...