సురక్షిత తాగునీటితోనే వ్యాధులు దూరం


Mon,July 15, 2019 12:16 AM

సంస్థాన్‌నారాయణపురం: సురక్షిత తాగునీటితోనే వ్యాధులు దూరమవుతాయని మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. మండల పరిధి పుట్టపాకలో స్టార్‌ దవాఖాన, కేర్‌ ఫర్‌ యువర్‌ కిడ్నీ ఫౌండేషన్‌ సహకారంతో బూరలక్ష్మీనర్సింహ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కిడ్నీ స్పెషాలిటీ క్యాంపును ఆయన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 250 మందికి పరీక్షలు చేసి అవసరమైనవారికి ఉచితంగా మందులు అందజేశారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని హైదరాబాద్‌ దవాఖానకు రిఫర్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కువ మంది చేనేత కార్మికులు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కలుషిత నీరు తాగడం వల్లనే ఎక్కువగా రోగాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ సురక్షిత నీరు త్వరలో ప్రతి ఇంటికి వస్తాయన్నారు. చేనేత కార్మికులు నాణ్యమైన ఆహరం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు చక్రపాణి, శ్రీకాంత్‌, సర్పంచు శామల భాస్కర్‌, ఎంపీపీ గుత్త ఉమాప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతి, ఎంపీటీసీ మర్రి వసంత, నాయకులు దేప విప్లవరెడ్డి, ఆడెపు పరదేశి, సురేశ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు సుక్క గాలయ్య పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...