బీబీనగర్ మండలంలో..


Mon,July 15, 2019 11:10 PM

బీబీనగర్: గురుపౌర్ణమి పర్వదినానికి మండలంలోని షిర్డీ సాయిబాబా ఆలయాలు ముస్తాబయ్యాయి. మంగళవారం వేడుకలను నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పువ్వులు, విద్యుత్ దీపాలతో ఆలయాలను అలంకరించారు. భక్తులను దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించారు. కొండమడుగులోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం గురు చరిత్ర పారాయణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అనంతరం అన్నసమారాధన ఉంటుందని తెలిపారు. బీబీనగర్‌లోని బాబా ఆలయంలో ఉదయాన్నే మేలుకొలుపు, మంగళస్నానం, స్వామి వారికి ప్రత్యేక అలంకరణ, అన్నసంతార్పణ, సాయత్రం బాబావారిని పల్లకిలో ఊరేగించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మిడి లింగారెడ్డిశశిరేఖ దంపతులు తెలిపారు. అలాగే భట్టుగూడెంలోని సాయినాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాదాల వితరణ ఉంటుందని ఆలయ నిర్వాహకుడు కాటేపల్లి ఆంజనేయులుగౌడ్ తెలిపారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురుశిశ్య సంప్రదాయానికి మార్గదర్శకుడైన రోజు ఇదే కావడంతో ఆషాడ పౌర్ణమిని గురుపౌర్ణమిగా పిలుస్తారు. ఆధ్యాత్మిక గురువులు, ఉపాధ్యాయులు పంచిన జ్ఞానామృతానికి గుర్తుగా వేలాది మంది శిశ్యులు గురుపౌర్ణమిరోజున వారిని పూజిస్తారు. సరిగ్గా ఇదే రోజున గౌతమబుద్దుడు తన తొలి ఉపన్యాసం ఇచ్చినట్టు నమ్ముతారు. అందుకే బుద్దుడిని గురుపౌర్ణమిని పురస్కరించుకొని ఆరాధిస్తారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...