పేదింటి ఆడపిల్లలకు వరం కల్యాణలక్ష్మి


Mon,July 15, 2019 11:12 PM

మోత్కూరు : పేదింటి ఆడ పిల్లలకు కల్యాణలక్ష్మి గొప్ప వరమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తాళలేక మగబిడ్డ సంతానం లేక అనేక మంది దళిత, గిరిజనులు తమ అమాయకత్వంతో కూతుళ్లను అమ్ముకుంటున్నారన్నారు. ఇది గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణలో పుట్టిన ప్రతి ఇంటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మిని కానుకగా ఇస్తున్నారని తెలిపారు.

ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఇంతటి మహోత్తర సంక్షేమాన్ని పేద ప్రజల దరి చేరనిచ్చిన ఘటనలు లేవన్నారు. మంచి మనసున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ ఆన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వరుసగా వస్తున్న ఎన్నికల కోడ్ దృష్ట్యా చెక్కుల పంపిణీలో కొంత జాప్యం జరిగిందన్నారు. అవినీతి, దళారులకు తావు లేకుండా పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ అవసరాల కోసం కొంతమంది ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నారన్నారు. అలాంటివారు సృష్టిస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. కల్యాణలక్ష్మి, షాదిముబారక్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పె దళారులకు సహకరించే అధికారులు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి చీడ పురుగులు ఎంతటి వారైన వదిలేది లేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైనవారికి అందించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...