సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Mon,July 15, 2019 11:14 PM

ఆలేరురూరల్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ చైతన్య అన్నారు. మండలంలోని పటేల్‌గూడెంలో సోమవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పశువులు వ్యాధులకు గురికాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ పులుగం పద్మ యాదిరెడ్డి, పాల సంఘం చైర్‌పర్సన్ లక్ష్మి, శ్రీశైలం, రాజు, కృష్ణ పాల్గొన్నారు.

టీకా వేయించాలి యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య అన్నారు. సోమవారం మండలంలోని చొల్లేరులో సామూహిక గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోటకూరి అనురాధ, ఎంపీటీసీ కొక్కలకొండ అరుణ, పాల సంఘం చైర్మన్ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మల్లేశం, పశువైద్యాధికారులు శ్రీకాంత్, సంధ్యారాణి, సిబ్బంది నాగరాజు, రవి, అయిలయ్య, రామాంజనేయరాజు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...