పంచాయతీకి ఉపాధి


Mon,July 15, 2019 11:24 PM


-అనుసంధానం చేస్తూ గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ
-వరుస ఎన్నిక నేపథ్యంలో నాలుగు నెలలుగా జాప్యం
- ఇక జీపీల్లో క్షేత్ర సహాయకుడికి స్థానం
- సర్పంచ్, కార్యదర్శి పర్యవేక్షించే అవకాశం
- కూలీలకు చేతినిండా పని

యాదాద్రిభువనగిరి, జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ :గ్రామ పంచాయతీల్లో క్షేత్ర సహాయకుడికి ప్రత్యేక కుర్చీ, దస్ర్తాలు భద్రపరుచుకునేందుక బీరువా ఏర్పాట్లు చేస్తారు.గ్రామాల్లో కూలీలకు చేతినిండా పని కల్పించి వలసలు నివారించేందుకు తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ఆశించిన ఫలితాలు సాధించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పథకం ప్రారంభమై ఏండ్ల్లు గడుస్తున్నా...అందరికీ వంద రోజుల పని దొరకడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పథకాన్ని మరింత విస్తరించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఉపాధిని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేయాలని నిర్ణయించి, ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. జీపీల్లో ఇక క్షేత్ర సహాయకుడికి సైతం స్థానం కల్పించడంతో పాటు సర్పంచ్, కార్యదర్శి పర్యవేక్షించే అవకాశముండడంతో కూలీలకు చేతినిండా పని లభించనున్నది. భారత ప్రభుత్వం 2005 ఆగస్టు 25న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. గ్రామీణ కుటుంబంలో పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ 100 రోజుల పని కల్పించాలని, కనీస వేతనం వచ్చేలా చూడాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉపాధి కల్పించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతున్నది. కానీ కూలీలకు చేతినిండా పని కల్పించే పరిస్థితి లేక ఉపాధిహామీని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 4నెలల క్రితం సర్క్యూలర్‌ను జారీ చేసింది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ పనులను పంచాయతీలకు అప్పగించలేదు. ఎన్నికలు పూర్తయి పాలకవర్గాలు కొలువుదీరడంతో ఇక పంచాయతీలకు ఈ పథకాన్ని అనుసంధానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పంచాయతీలకు సమన్వయం..గ్రామాల్లో కూలీలకు చేతినిండా పని కల్పించి వలసలు నివారించేందుకు తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ఆశించిన ఫలితాలు సాధించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పథకం ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా అందరికీ వంద రోజుల పని దొరకడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పథకాన్ని మరింత విస్తరించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఉపాధిని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేయాలని నిర్ణయించి ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. జీపీల్లో ఇక క్షేత్ర సహాయకుడికి సైతం స్థానం కల్పించడంతో పాటు సర్పంచ్, కార్యదర్శి పర్యవేక్షించే అవకాశం ఉండడంతో కూలీలకు చేతినిండా పని లభించనున్నది.

తెలంగాణకు హరితహారం దస్ర్తాలతో పాటు ఉపాధిహామీ పథకానికి సంబంధించిన ఏడు దస్ర్తాలను గ్రామ పంచాయతీల పాలకవర్గం, కార్యదర్శి పర్యవేక్షణలో ఉంచి పనులు కొనసాగిస్తారు. క్షేత్ర సహాయకుడికి ఉపాధిహామీ పనులను పూర్తిస్థాయిలో అప్పగిస్తారు. గ్రామాల్లో ఎక్కడ ఉపాధి పనులు అవసరమవుతాయో తెలుసుకొని సర్పంచ్ గ్రామసభ దృష్టికి తీసుకెళ్లాలి. ఫిర్యాదులు రాకుండా బాధ్యతగా పనిచేయాలి.పంచాయతీల్లో పనులు..పారిశుధ్య చర్యల్లో భాగంగా డంప్ యార్డుల నిర్మాణాలకు ఉపాధి నిధులకను వాడుకోవచ్చు. చెత్తను తరలించేందుకు కూలీలకు 180 రోజుల పనిదినాలను కల్పిస్తారు. గ్రామంలో రూ.10లక్షల ఉపాధి పథకం నిధులతో శ్మశాన వాటికలను ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామాల్లో మరుగునీటి సమస్య పరిష్కారంతో పాటు భూగర్భజలాలు పెంచేలా ప్రతి ఇంటికీ ఇంకుడగుంత నిర్మించుకునేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 4వేలు ఇస్తారు. పశువుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నీటి తొట్లు నిర్మించుకోవచ్చు. ఒక్కోనీటి తొట్టికి రూ. 21వేల వరకు ఉపాధి నిధులు ఖర్చు చేసుకోవచ్చు.

గ్రామాల అభివృద్ధిపై దృష్టి..
ఉపాధి హామీ పథకాన్ని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేయడంతో గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశమున్నది. సర్పంచ్‌లు సరైన దృష్టి పెడితే రూ. కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను గ్రామాల్లో చేసుకునే వీలున్నది. గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరిగి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు దోహదపడనున్నది. ఉపాధి పథకంలో అక్కడక్కడా క్షేత్ర సహాయకులు బాధ్యతారాహిత్యం కొట్టిచిన్నట్లు కనిపిస్తున్న విమర్శలూ ఉన్నా యి. ఉపాధిహామీని పంచాయతీలకు అనుసంధానం చేస్తే క్షేత్ర సహాయకుల్లో జవాబుదారీ తనం పెరిగే అవకాశమున్నది. గ్రామాల్లో కూలీలకు సరిపడా పనులు కల్పించే వీలుంటుంది. సర్పంచ్, కార్యదర్శి పర్యవేక్షణలో ఉపాధిహామీ పనులు చేపడితే కూలీలకు ఎక్కువ పనిదినాలు కూలి లభించనున్నాయి.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...