యాదాద్రిలో పరమశివుడికి రుద్రాభిషేకం


Tue,July 16, 2019 03:12 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్థ్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి సోమవారం రుద్రాభిషేకం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్త జనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకం అయ్యారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాతవేళ జరిగే రుద్రాబిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ఉప ప్రధాన పురోహితులు గౌరీబట్ల నర్సింహరాములుశర్మ ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యా యి. శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయంలో శ్రీ సుదర్శ న నారసింహ మహా యాగములో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీవారి ఖజానాకు రూ. 9, 45, 864 ఆదాయం
శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 32, 986, ప్రసాద విక్రయాలతో రూ. 4, 62, 310, విచారణ శాఖతో రూ. 37, 070 తో పాటు అన్ని విభాగాల నుంచి రూ.9,45,864 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...