కందిగడ్డ తండా రైతులకు న్యాయం చేస్తాం


Tue,July 16, 2019 11:59 PM

ఆలేరురూరల్ : అశ్వరావుపల్లి నుంచి కొల్లూరు వరకు వచ్చే దేవాదుల కాలువ పనులను మంగళవారం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి టంగుటూరు వద్ద పరిశీలించారు. అనంతరం కందిగడ్డతండా వద్ద కాల్వ పనులను అడ్డుకుంటున్న రైతులతో ఆమె చర్చించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న అశ్వరావుపల్లి కాలువ ద్వారా ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు అందడం ఖాయమన్నారు. అశ్వరావుపల్లి కాలువ మూడు రీచ్‌లో నిర్మాణం జరుగుతుండగా ఆలేరు వరకు వచ్చే కాలువ రీచ్3లో ఉందన్నారు. అశ్వరావుపల్లి మెయిన్ కెనాల్ పొడవు 35 కిలో మీటర్లు కాగా ఆలేరులో మాత్రం 10 కిలోమీటర్లు కాల్వ నిర్మాణం జరగాల్సి ఉండగా ఇప్పటికే భూసేకరణ జరిగిందన్నారు. కాలువ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. డిసెంబర్ నెలలో పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మెయిన్, డిస్టిబ్యూటరీ కెనాళ్లతో ఆలేరు నియోజకవర్గంలోని శారాజీపేట, టంగుటూరు, మందనపల్లి, గొలనుకొండ, కొల్లూరు, సాయిగూడెం, వెల్మజాల,అనంతారంలోని 15 వేల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ మంగీలాల్, సర్వేయర్ రాజశేఖర్, తహసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, టంగుటూరు ఎంపీటీసీ జూకంటి అనూరాధ అనిల్, కందిగడ్డతండా సర్పంచ్ కేతావత్ సుజాత, మాజీ జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, జిల్లా గ్రంథాలయసంస్థ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, నాయకులు చింతకింది మురళి, ఎలగందుల వెంకటేశ్, నీల రమన్నా, జాలపు రాంరెడ్డి, వీరయ్యనాయక్, జైరాంనాయక్, కొరుకొప్పుల కిష్టయ్య, పోరెడ్డి శ్రీనివాస్, బింగి రవి, మొరిగాడి వెంకటేశ్, పంతం కృష్ణ, దూడం మధు తదితరులున్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...