గ్రహణంతో ముందస్తుగా ఆలయాల మూసివేత


Tue,July 16, 2019 11:59 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు నిర్ణీత సమయం కన్నా ముందుగానే ద్వారబంధనం గావించబడ్డాయి. గ్రహణం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే నిర్ణయంతో ఆలయాలను మూసివేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు. జిల్లాలోనే అత్యంత పెద్ద దేవాలయమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆల యం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సా యంత్రం 6. 30 గంటలకు ద్వారబంధనము చేశారు. శ్రీవారికి నిర్వహించే అన్ని కైంకర్యాలను నిర్వహించిన మీదట ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకులు ప్రధానాలయం ద్వారాలకు తాళం వేశారు. సాధారణంగా స్వామివారి ఆలయాన్ని పవళింపు సేవ ను రాత్రి 10గంటలకు నిర్వహించిన మీదట ఆలయాన్ని మూసివేస్తారు. కాని చంద్రగ్రహణం ఉన్నందున ఐదున్నర గంటల సమయం ముం దు నుంచే గ్రహణ శూల ఉం టుందని యాదాద్రీశుడిని ఆలయంలో ఆరున్నర గంటల వరకే శ్రీవారికి చేయాల్సిన అన్ని పూజా కైంకర్యాలు జరిపినట్లు ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం 4.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి సంప్రోహక్షణ, శాంతి అభిషేకం, శాంతి హోమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్జిక సేవలైన సుదర్శన నారసింహ హోమం, సహస్రనామార్చన బుధవారం రద్దు చేసినట్లు చెప్పారు. శ్రీవారి కల్యాణ కైంకర్యము యథావిధిగా ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని చెప్పారు.

నేటి ఉదయం 9గంటల నుంచి దర్శనాలు ప్రారంభం..
యాదాద్రీశుడి దర్శనాలు బుధవారం ఉదయం 9గంటల నుంచి ప్రారంభమవుతాయని ప్రధానార్చకులు చెప్పారు. సాధారణంగా ఆలయంలో సర్వ దర్శనాలు ఉదయం 6గంటల నుంచే మొదలవుతాయి అయితే చంద్రగ్రహణం ఏర్పడిన తరువాత నిర్వహించాల్సిన ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా దర్శనాలు ఆలస్యంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

పాతగుట్టలో కూడా మందస్తుగా ద్వారబంధనము..
పాతగుట్టలో కూడా చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 6.30గంటలకు ఆలయ ముఖ్య అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకులు ప్రధానాలయ తలుపులు మూసివేసి తాళం వేశారు. నేటి ఉదయం 4.30 గంటలకు ఆలయం తెరిచి పూజా కైంకర్యాలు నిర్వహిస్తామని మాధవాచార్యులు తెలిపారు. కాగా గ్రహణం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలయ ఈవో ఎన్. గీత, ఏఈవోలు మేడిశివకుమార్, దోర్భల భాస్కర్, జూశెట్టి కృష్ణాగౌడ్, వేముల రామ్మోహన్, గజవెల్లి రమేశ్‌భాబులతో సమావేశం నిర్వహించారు. ఆలయం తెరిచే సందర్భంగా అర్చక బృందం తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆమె వివరంగా చర్చించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...