పశువైద్యుల సలహాలు పాటించాలి


Thu,July 18, 2019 12:44 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : పాడి రైతులు పశువైద్యుల సలహాలు పాటించాలని చందుపట్ల సర్పంచ్ చిన్నం పాండు, ఎంపీటీసీ కొండల్‌రెడ్డి అన్నారు. మండలంలోని చందుపట్లలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. పశువుల్లో సంక్రమించే కాలానుగుణ వ్యాధులపై పాడిరైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ పండిత్‌రెడ్డి, జూనియర్ పశువైద్యాధికారి శ్రీనివాస్, నర్సింహ, పశువైద్య సిబ్బంది, పాడిరైతులు పాల్గొన్నారు.

పలు గ్రామాల్లో..బీబీనగర్: మండలంలో పలు గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. బుధవారం మండల పశువైద్యాధికారిణి ఉష ఆధ్వర్యంలో జియాపల్లితండా, జియాపల్లి గ్రామాల్లో పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులు వ్యాధుల బారిన పడకుండా ముందుస్తుగా ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేయిస్తున్నదని, ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి కుమార్, పసువైద్య సిబ్బంది వినయ్, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...