స్వాతంత్య్ర సంబురం


Fri,August 16, 2019 01:12 AM

-ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
-పోచంపల్లి మున్సిపల్ కార్యాలయంలో
-జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
జాతీయ జెండా ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రముఖులు

భూదాన్‌పోచంపల్లి : స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. పోచంపల్లి మున్సిపల్ కార్యాలయంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్ మండల పార్టీ, పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిచిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ బాలశంకర్, ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సార సరస్వతి బాలయ్యగౌడ్, నాయకులు కందాడి భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సామ రవీందర్‌రెడ్డి, గుండు మధు, కర్నాటి రవీందర్, చిట్టిప్రోలు శ్రీనివాస్, సీత వెంకటేశం, దొడ్డమోని చంద్రంయాదవ్, పాక జంగయ్య యాదవ్, ఐతరాజు భిక్షపతి, నోముల మాధవరెడ్డి, గుండ్ల హరిశంకర్ గౌడ్, తంతరపల్లి వెంకటేశం, బత్తుల శ్రీశైలంగౌడ్, కర్నాటి అంజమ్మ, ఇబ్రహీంపట్నం అంజయ్య, మెరుగు జెన్నయ్య, గుణిగంటి మల్లేశంగౌడ్, పెద్దల చంద్రశేఖర్, వేముల సుమన్‌గౌడ్, సీత శ్రవణ్, నోముల ఉపేందర్‌రెడ్డి, చింతకింది కిరణ్‌కుమార్, తంగెళ్ల దశరథ తదితరులు పాల్గొన్నారు.

మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ..
మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు గుగులోతు దశరథనాయక్, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రాజు, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో డైరెక్టర్ కిషోర్‌రెడ్డి, పీహెచ్‌సీలో మండల వైద్యాధికారి హర్షారెడ్డి, ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏఈ ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో ఎజాజ్ అలీఖాన్, పోచంపల్లి సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి, జూలూరు సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ పక్కీరు మల్లారెడ్డి, చేనేత సహకార సంఘం వద్ద అధ్యక్షుడు భారత వాసుదేవ్, టై అండ్ డై అసోసియేషన్ వద్ద అధ్యక్షుడు తడక రమేశ్, పోచంపల్లి అర్బన్ బ్యాంకు వద్ద చైర్మన్ సీత దామోదన్‌తోపాటు ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రధానోపాద్యాయులు, యువజన, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జండానే ఎగరవేసి వందనం చేశారు.

ఘనంగా జెండా పండుగ..
బీబీనగర్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, కార్యాలయాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్‌లో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగల్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణిలు జెండా ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీనివాస్‌రావు, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి, మండల సమాఖ్యలో ఏపీఎం పాశకంటి మల్లేశం, పట్టణ గ్రామ పంచాయతీలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల కార్యాలయంలో రాచమల్ల శ్రీనివాసులు, అన్నంపట్లలో రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాను ఎగురవేసి దేశం కోసం త్యాగం చేసిన మహాత్ములకు నివాళులర్పించారు. భట్టుగూడెం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రామస్తుడు పల్ల వెంకట్‌రెడ్డి సొంత ఖర్చులతో గిఫ్ట్‌లు, నగదును అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవం..
వలిగొండ : మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీవో కార్యాలయం ముందు ఎంపీపీ నూతి రమేశ్‌రాజ్, పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎస్సై పి.శివనాగప్రసాద్, టీఆర్‌ఎస్ మండల పార్టీ కార్యాలయం ముందు మండల అధ్యక్షుడు డేగల పాండరి జెండా ఎగురవేశారు. వలిగొండ పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ఏవో అంజనీదేవి, వెలుగు కార్యాలయం మందు ఏపీఎం జానీ, గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ బోళ్ల లలిత, గ్రంథాలయం ఆవరణలో చైర్మన్ పల్లెర్ల ప్రకాశ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాల ముందు కార్మిక సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ వాకిటి పద్మాఅనందరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమ, ఎంపీడీవో నూకల వెంకటమ్మ, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర, ఎంపీటీసీలు పల్సం రమేశ్, ఆత్మ చైర్మన్ గంగధారి రాములు, యశోద, పల్లెర్ల భాగ్యమ్మ, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పబ్బు స్వామి, అయిటిపాములు ప్రభాకర్, సత్యనారాయణ, ఎదురుగట్ల రాములు, మైసోళ్ల సురేశ్, పోలేపాక సత్యనారాయణ, గంగారం రమేశ్, కొండూరి వెంకటేశం, సతీశ్, రమేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...