కామాంధుడికి ఐదేండ్ల జైలు


Fri,August 16, 2019 11:33 PM

యాదగిరిగుట్ట నమస్తే తెలంగాణ : కన్న కూతురిపై లైగింక వేధింపులకు పాల్పడిన కామాంధుడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. ఈ మేరకు శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా అదనపు జిల్లా న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. యాదగిరిగుట్ట సీఐ నర్సింహరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో నివాసం ఉంటున్న పరమేశ్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలకు అలవాటు పడి కామాంధుడిలా మారాడు. ఒంటరిగా ఉన్న సమయంలో తన కన్న కూతిరిపైనే లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలలుసుకున్న, చిన్నారి పెద్దమ్మ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గత ఫిబ్రవరి 11వ తేదీన ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి నిందితుడు పరమేశ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టగా... సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు పరమేశ్‌కు 5 సంవత్సరాల జైల్ శిక్ష, ఐదు వందల జరిమానా విధిస్తూ తీర్పులు వెలువరించారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...