షార్ట్ సర్యూట్‌తో ఇంట్లో వస్తువులు దగ్ధం


Sun,August 18, 2019 12:08 AM

భువనగిరి అర్బన్: పట్టణానికి చెందిన లయిఖ్ అలీ ఇంటిలోని వస్తువులు షార్ట్ట్ సర్క్యూట్‌తో దగ్ధమయ్యాయి. బాధితుడు లయిఖ్ అలీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి లయిఖ్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యానికి బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఇంటి నుంచి వస్తున్న పొగను గమనించిన స్థానికులు ఇంటి యజమానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకొని ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లోని వస్తువులు ఫ్యాన్లు, ఏసీ, ఫర్నీచర్, స్టడీ సర్టిఫికేట్లు, ఫ్రిజ్, రూ.25వేల నగదు కాలి బూడిదయ్యాయి. రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఇంటి యజమాని లయిక్ అలీ తెలిపారు. యజమాని రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేయగా సంఘటన స్థలాన్ని వీఆర్‌వో సందర్శించి వివరాలను సేకరించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...