గుట్టలో ఆదివాసి ఎరుకల చైతన్య శిక్షణ తరగతులు


Sun,August 18, 2019 12:09 AM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : రాష్ట్ర ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఎరుకల హక్కుల సాధనకై ఆదివాసి ఎరుకల చైతన్య శిక్షణ తరగతులు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుతాడి కుమార్, లోకిని రాజుల ఆధ్వర్ంయలో శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని భారత్ ఫంక్షన్‌హాల్‌లో జరిగాయి. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, ఆల్ ఇండియా కాన్‌ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహేశ్వర్ పాల్గొని పలు అంశాలపై శిక్షణన ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి శిక్షణ తరగుతులు జరుపడం మంచి శుభపరిణామమన్నారు. అనంతరం ఎరుకల సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మహేశ్వర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కోశాధికారి రఘు, కన్వీనర్ రాంపల్లి నర్సింహ, భువనగిరి అధ్యక్షుడు ఎలిగి నరేశ్, సంఘం ముఖ్య సలహాదారుడు పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...