అద్భుత ఆధ్యాత్మిక నగరి


Sun,August 18, 2019 12:48 AM

-అద్భుత దివ్య క్షేత్రంగా యాదాద్రి
-ప్రపంచ యూనిక్ సెంటర్‌గాయాదగిరిగుట్ట
-ప్రధానాలయం పనులు డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశం
-దేవాలయ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపాదికన చేపట్టాలి
-బస్వాపూర్ చెరువు ప్రాంతంలోమైసూర్ బృందావన్ గార్డెన్
-ఇప్పటి వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు రూ. 692 కోట్లు
-ఫిబ్రవరిలోగా మౌలిక సదుపాయాలు కల్పించాలి-మూడు గంటల సుదీర్ఘ సూక్ష్మ పరిశీలన
-ఆరు గంటల సమీక్ష
-యాదాద్రి దేవాలయ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యాదాద్రిభువనగిరి జిల్లా:అంతర్జాతీయ అద్భుత దివ్య క్షేత్రంగా యాదాద్రి నిర్మాణం పూర్తి కావాలి... ప్రపంచ యూనిక్‌గా యాదగిరిగుట్ట నిలువాలి...ప్రతి ఒక్కరూ యాదాద్రి గురించే మాట్లాడుకోవాలి... ఎక్కడా రాజీ లేకుండా అధికారులు ఈ రెండు మూడు నెలలు కష్టపడితే ప్రపంచమంతా మెచ్చుకునేలా నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించేందుకు యాదాద్రికి వచ్చిన ఆయన సుమారు తొమ్మిది గంటల సుదీర్ఘ పరిశీలన...సమీక్షల అనంతరం అధికారులు చేయాల్సిన విధి విధానాలను ఖరారు చేశారు. యాదాద్రి దేవాలయ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రధాన దేవాలయం పనులు తుది దశకు చేరుకున్నాయని, రెండు, మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు. ప్రధాన దేవాలయం పనులకోసం ఇప్పటి వరకు రూ. 235 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆలయ నిర్మాణ పనుల కోసం తక్షణం రూ. 54 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దాదాపు మూడు గంటల పాటు గుట్టపై కలియదిరిగారు. టెంపుల్‌సిటీ, రింగ్‌రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం, గండి చెరువు, ప్రధానాలయం ప్రాకారం నిర్మాణం, దక్షిణగోపురం, వాహనశాల, సహస్రదీపాలంకరణను పరిశీలించారు. అంతకు ముందు యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు. -యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ
రెండు మూడు నెలల్లో యాదాద్రి ప్రధానాలయం పనులు.. నాలుగు నెలల్లో టెంపుల్ సిటీ నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం యాదాద్రి పునర్నిర్మాణ పనులను ఆయన విస్తృతంగా పరిశీలించారు. ఉదయం 11.45 నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ సుమారు మూడు గంటల పాటు కాలినడకన కలియతిరిగారు. రూ.143 కోట్లతో నిర్మిస్తున్న 5.2 కిలోమీటర్ల రింగ్‌రోడ్డుతో పాటు తిరువీధులు, మహారాజగోపురాలు, ఆలయ మహామండపం, పుష్కరిణి, శ్రీ చక్రబ్లాక్, ప్రెసిడెన్షియల్ సూట్స్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు యాదాద్రి కొండపైకి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...