విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం తగదు


Mon,August 19, 2019 11:26 PM

భూదాన్‌పోచపల్లి : విద్యుత్ సరఫరాలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంట్ సిబ్బంది అందుబాటులో ఉండక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. వర్షాకాలంలో చినుకుపడితే కరెంట్ తీసే పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ మాసం నుంచి 60 రోజుల పవర్ వీక్‌ను ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా మండల వ్యాప్తంగా వేలాడుతున్న విద్యుత లైన్లను వెంటనే తొలగించి పునరుద్ధ్దరించాలని తెలిపారు. పాత ఇనుప స్తంభాలు, శిథిలావస్థకు చేరిన సిమెంట్ పోల్స్ యుద్ధప్రాతిపదికన తొలిగించి, కొత్త పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆన్ ఆఫ్ స్విచ్‌లు బిగించాలన్నారు. వీధి దీపాలకు సంబంధించి ప్రతి గ్రామంలో మీటర్లు బిగించాలన్నారు.

విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో విద్యుదాఘాతంతో ఇటీవల పదులసంఖ్యలో పశువులు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడ్డాయని సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్, ఎంపీడీవో బాలశంకర్, డీఈ మురళీధర్‌రెడ్డి, ఏఈ ప్రభాకర్‌రెడ్డి, ఈవోఆర్డీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచులు మన్నె పద్మారెడ్డి, కోట అంజిరెడ్డి, గోడళ్ల ప్రభాకర్ గౌడ్, అందెల హరీశ్‌యాదవ్, చిన్నలచ్చి లింగస్వామి, కంటె రాములు, ఎల్లారెడ్డి, దోతి కుమార్, రమావత్ రాములు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...