ఈ నెల 26 నుంచి కుష్టు, క్షయవ్యాధిగ్రస్తుల గుర్తింపు


Mon,August 19, 2019 11:27 PM

భువనగిరి, నమస్తే తెలంగాణ : కుష్టు, క్షయవ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమాలు ఈ నెల 26 నుంచి సెస్ట్టెంబర్ 12వ తేదీ వరకు ఇంటింటి సర్వేతో పాటు జిల్లా వ్యాప్తంగా సదస్సులు కొనసాగుతాయని డీఎంహెచ్‌వో సాంబశివరావు అన్నారు. సోమవారం జిల్లాలోని ఆరోగ్య, ప్రాథమిక కేంద్రాల వైద్యాదికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సర్వేను సమగ్ర వంతంగా నిర్వహించాలని సంబంధింత వైద్యాధికారులు, సూపర్‌వైజర్ అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం జిల్లాలోని ఎన్‌ఎంలకు రోటా వైరస్ వ్యాక్సిన్ ఇంజక్షన్‌పై శిక్షణ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో రోట వైరస్ వల్ల చిన్న పిల్లలకు కలిగే నీళ్ల విరేచనాలు రాకుండా వ్యాక్సిన్‌ను సెప్టంబర్ 1వ తేదీ నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో వైద్యులు పాపరావు, రామయ్య, ధరణికుమార్, సతీశ్‌కుమార్, జ్యోతిబాయ్, డాక్టర్ పరిపూర్ణాచారి, సాయిరెడ్డి, సిద్దేశ్వర్, వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఫార్మసిస్టు సబితావేణి, సతీశ్, శ్రీకాంత్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...