రోడ్లకు మహర్దశ


Mon,August 19, 2019 11:34 PM

-రూ. 825 కోట్లతో రహదారుల నిర్మాణం
-కనువిందు చేస్తున్న రాయగిరి -యాదాద్రి రహదారి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : జిల్లాలో రోడ్లకు మహర్దశపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు రూ. 825 కోట్లతో 92 రోడ్ల పనులను చేపట్టారు. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలతో పాటు రహదారి సౌకర్యం కల్పిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. 10 భారీ వంతెనలను రూ. 51 కోట్లతో చేపట్టింది. వీటిలో జైకేసారం, రామన్నపేట మండలం అమ్మనబోలులో వంతెనలు పూర్తి కాగా మరో 8 నిర్మాణ దశలో ఉన్నాయి. జిల్లాలో 14 ప్రధాన రహదారులను చేపట్టారు. 9 భవనాలకు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రం నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రం నల్లగొండను కలుపుతూ 18 రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. యాదగిరిగుట్టకు భక్తులు సులువుగా ప్రయాణం చేసే వీలుగా రాయగిరి నుంచి యాదాద్రికి రూ.

110 కోట్లతో నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం చేశారు. దీంతో పాటు యాదాద్రి ఘాట్‌రోడ్డు చుట్టూ ఔటర్‌రింగ్‌రోడ్డు కోసం రూ. 143 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా టెండర్ పనులు పూర్తి చేశారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. ఆలేరు నుంచి నార్కట్‌పల్లి వరకు 74 కిలోమీటర్ల పొడవున రూ. 78.86 కోట్లతో చేపట్టిన పనులు జిల్లాలో అత్యంత పొడవైన రహదారిగా నిర్మాణమవుతున్నది. తాజాగా సెంటర్ రోడ్ ఫండ్ (సీఆర్‌ఎఫ్) కింద జిల్లాలోని 5 మేజర్ రోడ్లను విస్తరించేందుకు ప్రభుత్వం సుమారు రూ. 52 కోట్లను విడుదల చేసింది. వీటిలో నాలుగు రోడ్ల పనులు పూర్తి కాగా మరొకటి నిర్మాణ దశలో ఉన్నది.

రహదారులకు మహర్దశ
2014 నుంచి ఆలేరు నియోజకవర్గంలోని బీటీ రోడ్లకు మహర్దశ పట్టుకున్నది. ఆలేరు నియోజక వర్గంలోని పలు మండలాల్లో రూ. కోట్లు కేటాయించి సింగిల్ లైన్‌తోపాటు డబుల్ లైన్ బీటీరోడ్లను నిర్మించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ. 26.50 కోట్లు ఖర్చుచేసి బీటీరోడ్డు పనులను చేపట్టారు. రూ. 18 కోట్లతో 13 కిలో మీటర్లు కొండమడుగుమెట్టు నుంచి బొమ్మలరామరం వరకు, రూ. 14.0 కోట్లతో 12.5 కిలో మీటర్లు ఆలేరు నుంచి జీడికల్ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రూ. 7.50 కోట్లతో 10 కిలో మీటర్లు తుర్కపల్లి నుంచి యాదగిరిగుట్ట వరకు బీటీ వేశారు. రూ. 5 కోట్లతో 6.6 కిలో మీటర్లు ఆలేరు నుంచి బచ్చన్నపేట వరకు బీటీ రోడ్డు పనులు చేపట్టారు. ఆలేరు నుంచి రఘునాథపురం వరకు బీటీ రోడ్డు మంజూరు కాగా బొమ్మలరామారం నుంచి గట్టుమైసమ్మ టెంపుల్ వరకు సీడీపీ నిధులు రూ. 1.25 కోట్లు, రంగాపురం నుంచి రామలింగపల్లి వరకు బీటీ రోడ్డుకు రూ. 70 లక్షలతో నిర్మాణం చేపట్టారు. పిల్లిగుండ్ల తండా నుంచి హన్మాపురం మీదుగా రుస్తాపురం వరకు ఆరు కిలో మీటర్లు బీటీ వేశారు. ఫకీరుగూడెం నుంచి నాగినేనిపల్లి వరకు రూ. 70 లక్షలతో బీటీ వేశారు. వంగపల్లి నుంచి మండల కేంద్రానికి రూ. 1.20 కోట్లతో బీటీ రోడ్డును ఆధునీకరించారు. సీడీపీ నిధులతో వర్టూర్ నుంచి ఖప్రాయిపల్లికి రూ.

1.30 కోట్లు కేటాయించి బీటీ రోడ్డును ఆధునీకరించారు. ఇక దిలావర్‌పూర్ నుంచి మోటకొండూర్‌కు వెళ్లే దారిని రూ. 40 లక్షలతో బీటీగా మార్చారు. మోటకొండూర్ నుంచి సికిందర్‌నగర్‌కు వెళ్లే దారి సైతం రూ. 20 లక్షలు, సికిందర్‌నగర్ నుంచి కాటేపల్లికి రూ. 2.16 కోట్లు ఖర్చు చేసి బీటీరోడ్డుగా మార్చారు. చాడ నుంచి చందేపల్లి వరకు నూతన బీటీరోడ్డు వేశారు. తేర్యాల నుంచి అనంతారం వెళ్లే బీటీ రోడ్డుకు రూ. 2.20 కోట్లు మంజూరు చేయడంతో పాటు పనులను సైతం ప్రారంభించారు. యాదగిరిగుట్ట మండలంలో రూ. 110 కోట్లతో రాయగిరి బ్రిడ్జి నిర్మాణం, రూ. 2.81 కోట్లతో యాదగిరిగుట్ట నుంచి బీఎన్ తిమ్మాపురం వరకు వయా రాళ్లజనగాం, లప్పనాయక్ తండా వరకు బీటీ రోడ్డు, రూ. 2 కోట్లతో సైదాపురం నుంచి మల్లాపూర్ వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు, రూ. 47 లక్షలతో పెద్దకందుకూరు నుంచి యాదగిరిగుట్ట పీడబ్య్లూడీ రోడ్డు వరకు బీటీరోడ్డు, రూ. 1.25 కోట్లతో మాసాయిపేట నుంచి సాదువెళ్లి వరకు బీటీ రోడ్డు, రూ. 65 లక్షలతో జంగంపల్లి నుంచి రాళ్ల జనగాం వరకు బీటీ రోడ్డు, రూ. 1.5 కోట్లతో యాదగిరిగుట్ట నుంచి జంగంపల్లి వరకు బీటీ రోడ్డు రెన్యూవల్, రూ. 20.80 లక్షలతో జంగంపల్లి నుంచి రాంపూర్ తండా వరకు బీటీ రోడ్డు రెన్యూవల్, రూ. 79.30 లక్షలతో మాసాయిపేట నుంచి ధర్మారెడ్డిగూడెం వరకు బీటీ రోడ్డు రెన్యూవల్, రూ. 46 లక్షలతో వంగపల్లి నుంచి మోటకొండూర్ జడ్పీరోడ్డు, జమ్మాపూర్ నుంచి వయా చొల్లెరు వరక బీటీ రోడ్డు నిర్మించారు. రూ. 36.40 లక్షలతో గౌరాయిపల్లి నుంచి రఘునాథపురం రోడ్డు వయా సాదువెళ్లి, కమటంగూడెం వరకు బీటీ రోడ్డు రెన్యూవల్ చేసి రోడ్లను పూర్తిగా పునరుద్ధరించారు. తుర్కపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో రూ. 5.17 కోట్లతో బీటీ రోడ్లుగా మార్చారు. రూ. 1. 3 కోట్లతో జగదేవపూర్ పీడబ్య్లూడీ రోడ్డు నుంచి వయా వసాలమర్రి గోపాల్ పూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు రూ. 55.90 లక్షలతో జగదేవ పూర్ పీడబ్య్లూడీ రోడ్డు నుంచి వయా ఇబ్రహీంపూర్ దత్తాయిపల్లి వరకు రూ.55.30 లక్షలతో మాదాపూర్ నుంచి నాగాయపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.

తుర్కపల్లి నుంచి యాదగిరిగుట్ట వరకు బీటీ రోడ్డు రెన్యూవల్‌కు రూ. 1.48 కోట్లు మంజూరు చేశారు. రూ. 55 లక్షలతో మల్కాపూర్ నుంచి బద్దుతండా వరకు, రూ.90 లక్షలతో గొల్లగూడెం నుంచి రామోజీనాయక్ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఆత్మకూరు(ఎం) మండలంలోని ఖప్రాయిపల్లి - మొదుగుబాయిగూడెంలోని బిక్కేరు వాగుపై 2015లో రూ. 1.70 లక్షలతో వంతెన నిర్మాణం పూర్తి చేశారు. కొరటికల్ నుంచి ఉప్పలపహాడ్ వరకు 6 కిలో మీటర్ల వరకు రూ. 2.34 కోట్లతో బీటీ రోడ్డు నిర్మించగా, పల్లెర్ల ఎక్స్‌రోడ్డు నుంచి లింగరాజుపల్లి వరకు రూ. 98 లక్షలతో 2 కిలో మీటర్ల వరకు బీటీ రోడ్డు నిర్మించారు. రాజాపేట మండలంలో రూ. 3.46 కోట్లతో రఘునాథపురం వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. రఘునాథపురం నుంచి సోమారం వరకు రూ. 3.11 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ. 1.96 కోట్లతో నెమిలె నుంచి సోమారం వరకు ఆరు కిలో మీటర్ల బీటీ రోడ్డు, రూ. 2.20 కోట్లతో కుర్రారం వయా చిన్న మేడారం బొందుగుల వరకు ఏడు కిలో మీటర్ల వరకు బీటీ రోడ్డును నిర్మించారు.

యాదాద్రికి నలుదిశలా రోడ్లు
యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ శనివారం పర్యటించిన సందర్భంగా రోడ్ల విస్తరణ పనులపై ప్రధానంగా చర్చించారు. తుర్కపల్లి- యాదాద్రి, రాజాపేట- యాదాద్రి, వంగపల్లి- యాదాద్రి రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాయిగిరి యాదాద్రి పనులు పూర్తయ్యాయి.

అద్దంలా చౌటుప్పల్ డివిజన్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో చౌటుప్పల్ డివిజన్‌కు మహర్దశ పట్టుకుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతాన్ని అద్దంలా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వాల హయాంలో ఒక్క రహదారి ఏర్పాటు కాకపోవడంతో ఈ ప్రాంత వాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రహదారులు నిర్మించింది.

మండలాల రోడ్లకు మహర్దశ..
చౌటుప్పల్ మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి. చౌటుప్పల్ నియోజకవర్గంలోనే అతి పెద్ద మండలమైన చౌటుప్పల్‌ను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో మండల కేంద్రంలో సైతం సరైన రోడ్లు లేక పోవడం వల్ల ప్రమాదాలు నిత్యకృత్యంలా మారాయి. చౌటుప్పల్- వలిగొండ రోడ్లను పూర్తిగా చేయడంతో పాటు వలిగొండ క్రాస్ రోడ్డు నుంచి బీసీ కాలనీకి ప్రత్యేకమైన రహదారిని ఏర్పాటు చేసింది. దండుమల్కాపురం టెక్స్‌టైల్ పార్క్(అపెరల్)లో అత్యంత సుందరమైన రోడ్లను ఏర్పాటు చేసింది. చౌటుప్పల్-నాగారం , చౌటుప్పల్-సంఘం రోడ్లలో కల్వర్టులు ఏర్పాటు చేసింది. అదేవిధంగా చిన్నకొండూరు-జిబ్లక్ పల్లి రోడ్డుకు మరమ్మతులు చేయించింది. మరో రూ. కోటి 45 లక్షలతో చౌటుప్పల్-నాగారం, రూ. కోటి 10లక్షలతో చౌటుప్పల్-నల్లగొండ రోడ్లు ఏర్పాటవుతున్నాయి. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఇప్పటికే హెచ్‌ఎండీఏ నిధులు రూ. 7.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఇప్పటికే చౌటుప్పల్ పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. పరిశ్రమల నుంచి రాబట్టిన సీఎస్‌ఆర్ నిధులు రూ. కోటి, ఎన్‌ఆర్‌జీఎస్ నిధులు రూ. 1.50 కోట్లు, సీడీపీ నిధులు రూ. కోటితో సీసీ రోడ్లు, లింక్ రోడ్లను ఏర్పాటు చేశారు. సంస్థాన్‌నారాయణపురం మం డల ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చౌటుప్పల్ -మునుగోడు డబుల్ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రూ. 42 కోట్లతో 36 కి.మీ మేర రోడ్డును ఏర్పాటు చేశారు. కోటి 50లక్షలతో గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. రామన్నపేట మండలంలో రూ. 3కోట్ల 50లక్షల తో సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. రూ. 75లక్షలతో దుబ్బాక రోడ్డులోని మూసీకాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. లకా్ష్మపురం రోడ్డులోని మూసీకాల్వపై రూ. 27కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో మోత్కూరు రూపు రేఖలు పూర్తిగా మారాయని చెప్పవచ్చు. రూ. 20కోట్లతో మోత్కూరు- అమ్మనబోలు రోడ్డు, రూ. 10కోట్లతో మోత్కూరు- పాటిమట్ల రోడ్లు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మోత్కూరు మండలంలోని అన్ని గ్రామాల్లో రూ. 12కోట్లతో సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...