ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి


Wed,August 21, 2019 12:04 AM

బొమ్మలరామారం : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలు మంగళవారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. దేశానికి ప్రధానిగా అత్యున్నతమైన సేవలందించిన రాజీవ్‌గాంధీ ఆశయాలను సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాంపల్లి మహేశ్‌గౌడ్‌, ఎంపీటీసీ మైలారం ఈదమ్మయాదయ్య, గ్రామశాఖ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బైసు రాజేశ్‌ పైలెట్‌, ఈశ్వర్‌, శాదం వీరేశ్‌, బాల్‌రాజ్‌, మల్లేశ్‌, ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సాదుల జంగయ్య, అంజయ్య, నాయకులు పాల్గొన్నారు.

రాజాపేటలో రాజీవ్‌గాంధీ జయంతి..
రాజాపేట : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బీర్ల ఐలయ్య, నెమిల మహేందర్‌గౌడ్‌, బుడిగే పెంటయ్యగౌడ్‌, వెంకటేశ్‌, అకిరెడ్డి బాలయ్య, సురేందర్‌, సిల్వేరు బాలరాజు, బసవయ్యగౌడ్‌, సిద్దేశ్వర్‌ పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...