పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలి


Wed,August 21, 2019 12:04 AM

బొమ్మలరామారం : శాంతి పరిరక్షణ చర్యల్లో భాగంగా పోలీసుల సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చీకటిమామిడి గ్రామంలో పోలీసులు నిర్వహించిన ‘ఫెల్ట్‌ నీడ్స్‌' అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఏఎస్‌ఐ శంకరయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులకు శాంతి భద్రత, ఈవ్‌ టీజింగ్‌, అక్రమాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక సంఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం అందిస్తే సరైన న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు.. పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొడుగు చంద్రమౌళి, కిషన్‌నాయక్‌, శాంతాచారి, పోలీసు సిబ్బంది జనార్ధన్‌, స్వామి, నాగేశ్వర్‌రావు ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...