బాల్య వివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలి


Wed,August 21, 2019 12:04 AM

రాజాపేట : బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ బాలమణియాదగిరిగౌడ్‌ అన్నారు. ప్లాన్‌ ఇండియా మహితా గర్ల్‌ అడ్వకసీ అలయన్స్‌ సహకారంతో నీడ్‌ సంస్థ ఆధ్యర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బాల్య వివాహాలను పోత్సహిస్తే వెంటనే చైల్డ్‌లైన్‌ ఫోన్‌ నెంబర్‌ 1098 లేదా 100 సమాచారం అందించాలన్నారు. బాల్య వివాహాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై భిక్షపతి, ప్రధానోపాధ్యాయులు బూర్గు మహేందర్‌రెడ్డి, మల్లెమాల శౌరి, నీడ్‌ సంస్థ డైరెక్టర్‌ కానుగంటి శ్రీశైలం, కౌకుంట్ల మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...