ఆంజనేయస్వామివారికి ఘనంగా ఆకు పూజ


Wed,August 21, 2019 12:05 AM

-శ్రీవారి సన్నిధిలో మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుండు సుధారాణి-
-హుండీలతో రూ. 87, 85, 728 ఆదాయం
-శ్రీవారి ఖజానాకు నిత్య ఆదాయం రూ. 8, 51, 035
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ :యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి మంగళవారం ఆకు పూజ ఘనంగా నిర్వహించారు.ఆంజనేయస్వామివారిని శ్రీచందనంతో అలంకరించారు. జిల్లేడు పూలు, తమలపాకులతో అర్చన చేశారు. ఆంజనేయ స్వామివారికి ఇష్టమైన తినుబండాగారాలను నైవేధ్యంగా సమర్పించారు. వడ పప్పు, బూరెలు, అరటి పండ్లు తదితర పదార్ధాలను సమర్పించి హనుమాన్‌చాలీసా పఠించారు. ఈ కార్యక్రమాలను ప్రధానార్చకులు నల్లంతీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాం డూరి వెంకటాచార్యులు, చింతపట్లరంగాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహుడికి సాంప్రదాయ నిత్య పూ జలు పెద్ద ఎత్తున జరిగాయి.

శ్రీవారి సన్నిధిలో గుండు సుధారాణి
శ్రీలక్ష్మీనరసింహుడి సన్నిధిలో తెలంగాణ ప్రభుత్వ మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుండు సుధారాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

హుండీ ఆదాయం..
శ్రీవారికి 26 రోజుల హుండీలతో ఆదాయం రూ. 87,85, 728 ఆదాయం సమకూరినట్లు ఆల య ఈవో ఎన్‌. గీత తెలిపారు. 146 గ్రాముల బంగా రం, వెండి ఏడు కిలోల 800 గ్రాములు వచ్చినట్లు ఆమె తెలిపారు.

శ్రీవారి ఖజానాకు రూ. 8, 51, 035 ఆదాయం..
శ్రీవారికి ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.64, 144, 150 రూపాయల దర్శనం టికెట్‌తో రూ.18, 600, వ్రత పూజలతో రూ.31, 500, ప్రసాద విక్రయాలతో రూ.4,22, 360, విచారణ శాఖతో రూ. 49, 050, శాశ్వత పూజలతో రూ.17,232 పాటు అన్ని విభాగాల నుంచి రూ.8,51, 035 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...