‘హరితవనాలుగా మారాలి’


Wed,August 21, 2019 12:05 AM

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : గ్రామా ల్లో విరివిగా మొక్కలు నాటి హరితవనాలుగా మార్చాలని జిల్లా వ్యవసాయాధికారి అనూరాధ పేర్కొన్నారు. తంగడపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన హరితహారంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన చేతుల మీదుగా మొక్కలు నాటి నీరు పోశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారంలో అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యులు కావాలని తెలిపారు. మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురువాలంటే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలన్నారు. మొక్కలు ఆక్సిజన్‌ బాంఢాగారాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో ముత్యాల నాగరాజు, రఘునందన్‌రెడ్డి, పంతంగి సాగర్‌, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...