వయోవృద్ధుల పట్ల శ్రద్ధ వహించాలి


Wed,August 21, 2019 12:06 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : వయోవృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ రమేశ్‌ కోరారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వయోవృద్ధులకు సంబంధించిన వ్యాధులపై వైద్యాధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నిర్దేశించిన రోజు విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈసందర్భంగా వయోవృద్ధుల ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగించే ప్రచార సామగ్రిని (బోర్డులను) జాయింట్‌ కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ సాంబశివరావు, డాక్టర్‌ జయలక్ష్మి, జిల్లా ఎన్‌సీపీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రామ్మూర్తి పాల్గొన్నారు

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...