ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుకుందాం


Mon,September 16, 2019 11:11 PM

బీబీనగర్ : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుకొని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మన వంతు చేయూతనందిద్దామని ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ అన్నారు. అందుకు తన సహాయసహకారాలతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలని ఆయన కోరారు. మండలంలోని పడమటిసోమారం, వెంకిర్యాల గ్రామాల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రోద్బలంతో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరంతర అల్పాహార కార్యక్రమాన్ని ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయాన్నే వ్యవసాయం, కూలీ పనులకు వెళ్తుండంతో పిల్లలు ఉదయం ఏమీ తినకుండా వ స్తుండటంతో మధ్యాహ్న భోజన సమయం వరకూ అలాగే ఉండటంతో నీరసించి చదువుపై శ్రద్ధ ఉండక అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. దీనిని దృష్టి లో ఉంచుకొని ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్ధేశంతోనే ఎమ్మెల్యేతో మాట్లాడి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో అల్పాహారానికి కావాల్సిన ముడి సరుకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు తలబోయిన గణేశ్‌యాదవ్, అరిగె సుదర్శన్, ఎం పీటీసీ గండు వసంత బస్వయ్య, మాజీ జడ్పీటీసీ సందిగారి బస్వ య్య, ఉపసర్పంచ్ వెంకటేశ్, ప్రధానోపాధ్యాయులు రంగయ్య, ధర్మయ్య, వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ తరగతుల ప్రారంభం..
పడమటిసోమారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లో వాయిస్ ఆఫ్ డ్రీమ్స్ ఎన్నారై స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు డిజిటల్ తరగతులపై అవగాహన కల్పిం చి బోధించారు. డిజిటల్ క్లాసుల ఏర్పాటుకు సహకరించిన ఎంపీపీని స్థానిక సర్పంచ్ తలబోయిన గణేశ్‌యాదవ్, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీనివాస గుప్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా టై, బెల్టులను అందజేశారు.

ఎంపీపీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా విరాళాలు అందించిన గ్రామస్తులు..
పడమటిసోమారంలో... సర్పంచ్ తలబోయిన గణేశ్‌యాదవ్ రూ.50వేలు, మాజీ జడ్పీటీసీ సందిగారి బస్వయ్య రూ.50వేలు, అల్వ మోహన్‌రెడ్డి రూ.20 వేలు, మాజీ సర్పంచ్ తలబోయిన జంగయ్యయాదవ్, మాజీ ఉపసర్పంచ్ అల్వ మహిపాల్‌రెడ్డి, వార్డు సభ్యుడు ఎలిమినేటి కిషోర్,కొండల్‌రావు, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అల్వ బల్వంత్‌రెడ్డి, నర్సింగరావు, ఉపాధ్యాయ బృందం రూ.10వేలు, పద్మాబస్వయ్య, ఉస్మాన్, బద్దం అంజయ్య, సునీత, ముత్యా లు, ఎల్లారెడ్డి, బొమ్మగోని రాములు రూ.5వేలు చొప్పున మొత్తం రూ.2.37లక్షలు విరాళాలు అందించగా మాజీ ఉపసర్పంచ్ అల్వ బాల్‌రెడ్డి, వీరారెడ్డి సోదరులు పాఠశాలలో పాలరాతితో సరస్వతీ విగ్ర హం ఏర్పాటు, బుర్రి రవిగౌడ్, బద్దం భిక్షపతి అల్పహారానికి అయ్యే గ్యాస్ ఖర్చును భరిస్తామని తెలిపారు. ఇక పాఠశాలలో స్వీపర్ విధులు నిర్వహించే యూసుఫ్ తన నెల జీతాన్ని పాఠశాల అభివృద్ధ్దికి అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

వెంకిర్యాలలో... టీఆర్‌ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు రూ.50వేలు, సర్పంచ్ అరిగె సుదర్శన్ రూ.30వేలు, ఉపసర్పంచ్ కొండూరి వెంకటేశ్‌గౌడ్, ఎంపీటీసీ గండు వసంతాబస్వయ్య రూ.10 వేలు, వార్డు సభ్యులు తలారి మల్లేశ్, కొండ శ్రీనాథ్‌రెడ్డి, జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యారాలు ఎల్జబిత్ రూ.10వేలు, కొవ్వొళ్ల శ్రీనివాస్ రూ. 6వేలు, టంగుటూరి భరత్, ప్రాథమికోన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధర్మయ్య, గోడాల బాలరాజుగౌడ్, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు డబ్బికార్ రాజేశ్వర్, అంగన్‌వాడీ టీచర్లు నానవల పద్మ, చింతకింది అరు ణ, కురిమేటి జోతిలక్ష్మి, వట్టిపల్లి తిరుమల రూ. 5 వేలు, కట్ట బాలమణి, నీళకంఠ బాలమణి రూ. 4 వేలు, ఎర్రోళ్ల స్వరూప రూ.3వేల చొప్పున మొత్తం రూ.1.90లక్షలను విరాళంగా అందజేశారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...