యాదాద్రి నిర్మాణం అద్భుతం..


Mon,September 16, 2019 11:11 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఇంత బ్రహ్మండమైన పుణ్యక్షేత్రాన్ని ఈ రోజు నిర్మించుకుంటున్నామంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, దార్శనికతకు నిదర్శనమని పార్లమెంట్ సభ్యు డు డాక్టర్ కేకే కేశవరావు అన్నారు. యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకు లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం ఆర్చకులు ఆశీర్వచ నం జరిపారు. ఈ సందర్భంగా యాదాద్రిదేవస్థాన ని ర్మాణాలను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీపీపీఎస్సీ సభ్యులు విఠల్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. తెలంగాణకు తలమానికంగా యాదాద్రి ఆలయం నిర్మాణమవుతున్నదని చెప్పారు. కనివినీఎరుగని విధంగా యాదాద్రి నిర్మాణం జరుపుకుంటున్నదని చెప్పా రు. ఇంత పెద్ద ఎత్తున ఆలయాన్ని ని ర్మాణం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తి యాదాద్రిని సందర్శించే విధంగా నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. యాదాద్రి ఆలయ నిర్మాణం గురించి చూస్తే తప్ప, వర్ణించడానికి మాటలు సరిపోవని అన్నారు. సీఎం కేసీఆర్ దీర్ఘదృష్టి, విజన్‌తో తెలంగాణ రాష్ట్రం ఆ ధ్యాత్మికత సంతరించుకోవ డం ఖాయమని చెప్పారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ యాదాద్రి దేవస్థాన నిర్మా ణం నభూతో.. నా భవిష్యత్ అనే విధంగా జరుగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం పీఆర్‌వో రమేశ్‌హాజారి తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...