హరిహరులకు విశేష పూజలు


Mon,September 16, 2019 11:12 PM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి. వేకువ జామున స్వయంభువులకు నిత్య పూజలు చేసిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులను ఆరాధించారు. ఉత్సవ మండపంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం, తులసీ అర్చనలు చేశారు. అనంతరం సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవాలను ఆగమ శాస్త్ర రీతిలో నిర్వహించారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చనలు, మండపంలో అష్టోత్తరాలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు, బిల్వార్చనలు శైవ సంప్రదాయం ప్రకారం జరిపారు. వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజలు, బాలాలయంల అలంకార సేవోత్సవాలు వైభవంగా జరిగాయి.

కొనసాగుతున్న భక్తుల రద్దీ...
యాదాద్రి క్షేత్రంలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. హరిహరులను దర్శించి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వేకువ జామున నుంచే పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మొక్కులు, పూజ లు, దర్శనాల కోసం బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ తీరువీధులు సందడిగా మారాయి. భక్తుల హరిహర నామాస్మరణతో క్షేత్రం మారుమ్రోగింది. స్వామి వారికి సోమవారం భక్తుల నుంచి వివిధ విభాగాల నుంచి రూ. 7, 63, 096 ఆదాయం సమకూరింది.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...