వంగపల్లిలో అండర్‌పాస్ నిర్మించండి


Wed,September 18, 2019 12:19 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: వంగపల్లి గ్రామం నుంచి ఐదు మండలాల ప్రజలు వెళ్లేదారిలో నిర్మిస్తున్న ఎన్‌హెచ్ 163 వద్ద అండర్‌పాస్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశం జీవోఆవర్‌లో జాతీయరహదారి నిర్మాణంతో ఆయా మండలాలకు ఏర్పడుతున్న రవాణా సమస్యలను సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి మీదుగా ఆర్‌అండ్‌బీ రోడ్డుపై యాదగిరిగుట్ట, మోటకొండూర్, ఆత్మకూరు(ఎం), గుండాల, మోత్కూరు, ప్రజలు ప్రయాణం సాగిస్తారని చెప్పారు. జాతీయ రహదారి రావడంతో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిరుపయోగంగామారడంతో పాటు ఎన్‌హెచ్ రోడ్డును దాటే క్రమంలో ప్రమాదాలు సంభవించి, ఆపార ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అండర్‌పాస్ బ్రిడ్జిలేక గతంలో భువనగిరిలో జాతీయరోడ్డుపై జరిగిన ప్రమాదాలను గుర్తు చేస్తూ, ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని సభకు వివరించారు. ప్రజలు నిత్యం ప్రయాణించే రోడ్డుపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా అండర్‌పాస్ బ్రిడ్జిని మంజూరు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ప్రభుత్వ విప్ కోరారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...