పీఆర్‌టీయూటీఎస్ సభ్యత్వానికి అపూర్వ స్పందన


Thu,September 19, 2019 12:34 AM

రాజాపేట : పీఆర్‌టీయూటీఎస్ సభ్యత్వానికి ఉ పాధ్యాయుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బల్ల ఉపేందర్‌రావు అ న్నారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పీఆర్‌టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 వేల సభ్యత్వాలతో పీ ఆర్‌టీయూటీఎస్ అతి పెద్ద సంఘంగా ఆవిర్భవించిందన్నారు. జిల్లాలో 25 వందల సభ్యత్వాలు న మోదు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. పీఆర్‌టీయూటీఎస్‌తో ఉపాధ్యాయుల స మస్యలు పరిష్కారామవుతాయన్నారు. సీపీఎస్ వి ధానం రద్దు, పీఆర్‌సీ అమలు కోసం త్వరలోనే రాష్ట్ర నాయకులు సీఎం కేసీఆర్‌ను కలువనున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో పీఆర్‌టీయూటీఎస్ మండలాధ్యక్షుడు పాకాల కిష్టోఫర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బూర్గు మహేందర్‌రెడ్డి, మాధవరెడ్డి, మండల ప్రధా న కార్యదర్శి విష్ణు, జిల్లా కార్యదర్శ సుబ్బారాజు, సతీశ్, మాధవి, కనకయ్య, కేశవులు, అశోక్, రమేశ్, మాధవి, లత, శిరోమణి, సంజీవులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...