బాలస్వామికి ఘన సన్మానం


Thu,September 19, 2019 12:34 AM

ఆలేరుటౌన్ : పద్మశాలి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శికి ఘన సన్మానం లభించింది. మంగళవారం భువనగిరి జిల్లాకేంద్రంలో జరిగిన పద్మశాలి సంఘం జిల్లా సమావేశంలో ఆలేరు పట్టణంలోని భరత్‌నగర్‌కు చెందిన బాలస్వామి పద్మశాలి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీంతో బుధవారం భరత్‌నగర్‌కు చెందిన పద్మశాలి సంఘం కులస్తులు బాలస్వామిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశాలి కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలీయులు గుజ్జ అశోక్, నారాయణ, సిద్ధిరాములు, బొగ సంతోశ్, చింతకింది సిద్ధులు, బొగ వెంకటేశ్, అందె చంద్రమౌళి, కటకం హరినాథ్, బేతి గణేశ్, బొగ రాజయ్య, వెంగళ్‌దాసు కృష్ణమూర్తి, గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...