నెరవేరనున్న స్వప్నం


Thu,September 19, 2019 12:36 AM

-16 గ్రామాలను విలీనం చేసి మోటకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
-మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి వినతి
-సానుకూలంగాస్పందించిన మంత్రి

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెప్పించి, ఒప్పించి నూతన మండలంగా ఏర్పాటు చేసిన మోటకొండూర్‌ను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషి చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మోటకొండూర్ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవెర్చేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆలేరు వ్యవసాయమార్కెట్ కమిటీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మోటకొండూర్‌లో నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే మోటకొండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు విషయం ప్రభుత్వం దృష్టిలో ఉన్నందున వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. మోటకొండూర్‌లో వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు పత్తి కొనుగోలు కేంద్రం, జిన్నింగ్ మిల్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఆలేరు వ్యవసాయ మార్కెట్‌లో కొనసాగుతున్న వర్టూర్, మోటకొండూర్, దిలావర్‌పూర్, అమ్మనబోలు, ఇక్కుర్తి, మాటూరు, తేర్యాల, ఆరెగూడెం, మేడికుంటపల్లి, గిరిబోయినగూడెం, సికిందర్‌నగర్‌తోపాటు నూతనంగా మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌లో కొనసాగుతున్న కాటేపల్లి, చాడ, ముత్తిరెడ్డిగూడెం, కొండాపురం, నాంచారిపేట, చందేపల్లి, కదిరేణిగూడెం, దుర్శిగానిపల్లి, తేర్యాల, సింగారం, మొరిపిరాళ్ల, మొదుగుకుంట, కొరటికల్, పల్లెపహాడ్, పారుపల్లి గ్రామాలను కలుపుతూ మోటకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించుకున్నారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారని, ఇందుకు కావాల్సిన మౌలిక వసతులు, మానవ వనరుల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి మంత్రి ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ విప్ చెప్పారు. మోటకొండూర్‌లో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు, గోదాంలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్న మంత్రి త్వరలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. చాలా ఏండ్లుగా ఎదురుచూస్తున్న మోటకొండూర్ మండల ప్రజల స్వప్నం సాకారం కాబోతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...