ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు


Fri,September 20, 2019 12:03 AM

భూదాన్‌పోచంపల్లి : వ్యాపార వాణిజ్య కేంద్రాల్లో ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని భూదాన్‌పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ బాలశంకర్ హెచ్చరించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మటన్, చికెన్, కూరగాయలు, కిరాణం దుకాణాల వ్యాపారులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హే సేవా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ కవర్లు వాడటం పూర్తిగా నిషేధించిందన్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ కేంద్రంలోని ప్రతి వ్యాపారి.. వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ జూట్, పేపల్ బ్యాగులను వాడేలా కృషి చేయాలన్నారు. ఇక మటన్, చికెన్ విక్రయించేవారు.. వినియోగదారులు టిఫిన్ బాక్స్ తీసుకొస్తేనే అమ్మకాలు జరుపాలని, లేదంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. త్వరలో మున్సిపల్ కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించడంతోపాటు ప్లాస్టిక్ వాడకంపై దాడులు చేసి జరిమానాలు విధిస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం కొంత ఇబ్బందిగా ఉన్నా.. భవిష్యత్ తరాలకు మేలు చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ బాలాజీ, వ్యాపారులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వాడితే జరిమానా తప్పదు..
భువనగిరి అర్బన్ : ప్లాస్టిక్ వాడితే జరిమానా తప్పదని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హెచ్చరించారు. స్వచ్ఛతా హే సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారస్తులకు ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడితే రూ.10 వేలు జరిమానా విధిస్తామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు సహకరించాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ నివారణపై వ్యాపారస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో అధికారులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...