సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Fri,September 20, 2019 12:03 AM

భువనగిరి, నమస్తేతెలంగాణ : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ విజయ, మండల వైద్యాధికారి డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని అనాజీపురం గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతోపాటు ఉచితంగా డెంగీ వ్యాధి నివారణ మందులు అందజేసి మాట్లాడారు. డెంగీ వ్యాధి నివారణకు హోమియోపతి మందులు ఎంతగానో ఉపయోగపడుతాయని, దీనికి ఎలాంటి పత్యం పాటించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎదునూరి ప్రేమలతామల్లేశం, ఎంపీటీసీ సభ్యులు గునుగుంట్ల కల్పనాశ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ మైలారం వెంకటేశ్, స్పెషల్ ఆఫీసర్ మహాలక్ష్మి, వార్డు సభ్యులు గోగు శ్రీనివాస్, ఏఎన్‌ఎం కస్తూరి, అంగన్‌వాడీ టీచర్లు శ్రీరాంజానకి, కుంచం సువర్ణ, ఆశ ఆవర్కర్లు పద్మ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...