పల్లెలో ప్రగతి


Fri,September 20, 2019 12:09 AM

-జిల్లావ్యాప్తంగా సాగుతున్న 30 రోజుల ప్రణాళిక
-స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ప్రజానీకం
-ఊరూరా పారిశుధ్య పనులు.. మొక్కల పెంపకం
-పవర్‌వీక్‌లో భాగంగా విద్యుత్ సమస్యల పరిష్కారం
-గ్రామాల అభివృద్ధి కోసమే 30 రోజుల ప్రణాళిక
-కలెక్టర్ అనితారామచంద్రన్
-భువనగిరి మండలం సూరేపల్లి, ఆకుతోటబావితండాలో ఆకస్మిక పర్యటన

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: జిల్లాలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముమ్మరంగా సాగుతున్నది. గురువారం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో పలు పనులు చేపట్టారు. ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలంలో అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. బొమ్మలరామారం మండల కేంద్రంతోపాటు పక్కీరుగూడెం, గోవింద్‌తండా, చోలిపేట, రంగాపురం తదితర గ్రామాల్లో, తుర్కపల్లి మండలంలో పారిశుధ్య నిర్వహణ చేపట్టారు. రాజాపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీడీవో రామారాజు, ఎస్సై నాగేశ్వర్‌రావు, వైద్యాధికారి శివవర్మ తదితరులు శ్రమదానం చేశారు. గుండాల మండలంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. ఆలేరు మండలంలో పాత బావులు, బోర్లను పూడ్చి వేశారు. మురుగు కాల్వలను పునరుద్ధరించారు. మోటకొండూర్ మండలంలోని 18 గ్రామాల్లో ప్రణాళిక పనులు శరవేగంగా సాగుతున్నాయి.

భువనగిరి నియోజకవర్గంలోని అని మండలాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముమ్మరంగా సాగుతున్నది. భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని ధర్మారెడ్డిపల్లిలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సామ రవీందర్‌రెడ్డి తన సొంత నిధులు రూ.4 లక్షలతో గ్రామంలో పడావుబడిన రెండు వ్యసాయ బావులను పూడ్చివేశారు. జలాల్‌పూర్‌లో శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేశారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎంపీడీవో బాలశంకర్, ఎంపీవో పైళ్ల జనార్దన్‌రెడ్డి పనులను పర్యవేక్షించారు. బీబీనగర్ మండలంలోని రాఘవాపూర్‌లో ఎంపీపీ ఎరుకలల సుధాకర్‌గౌడ్, అన్నంపట్లలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, కొండమడుగులో ఎంపీడీవో శ్రీవాణిలు గ్రామ ప్రణాళికలో పాల్గొన్నారు.

చౌటుప్పల్ డివిజన్ వ్యాప్తంగా గ్రామ ప్రణాళిక ముమ్మరంగా కొనసాగుతున్నది. చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్‌లో ఎంపీడీవో రాకేశ్‌రావు, పంతంగిలో మండల ప్రత్యేకాధికారి హరిప్రసాద్ ప్రణాళికలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్, జనగాం, అల్లాదేవిచెరువులో చేపట్టిన పనుల్లో ఎంపీపీ గుత్తా ఉమాదేవీప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు. రామన్నపేట మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులు చేపట్టారు. మోత్కూరు మండలంలో పేరుకుపోయిన చెత్తకుప్పలు, పిచ్చి మొక్కలను తొలగించారు. అడ్డగూడూరు మండలంలో రోడ్ల వెంట ఉన్న కంప, పిచ్చి మొక్కలను తొలగించారు.


46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...