పోచంపలి అర్బన్ బ్యాంకుకు రెండు జాతీయ స్థాయి అవార్డులు


Sun,September 22, 2019 12:20 AM

భూదాన్‌పోచంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోచంపల్లి, చౌటుప్పల్, దేవరకొండ, నల్లగొండ, హాలియా, చండూరు. సూర్యాపేటలతో 7 బ్రాంచ్‌లు ఉన్న ది పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు వరుసగా ఎనిమిదోసారి రెండు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. దేశంలోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాకులకు ప్రతీ ఏటా బ్యాంకింగ్ ప్రాంటియర్స్ ముంబయి సంస్థ ఈ అవార్డులను అందజేస్తున్నది. బెస్ట్ డిజిటల్ బ్యాంకు, బెస్ట్ క్రెడిట్ గ్రోత్ బ్యాంకుగా రెండు అవార్డులు దక్కించుకున్నట్లు బ్యాంకు చైర్మన్ సీత దామోదర్, సీఈవో సీత శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఈ అవార్డులను ఈ నెల 19న గోవాలో జరిగిన జాతీయ కో ఆపరేటివ్ బ్యాంకుల సమ్మేళనం -2019 కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు అందుకున్నారు.

గత ఎనిమిది సంవత్సరాలుగా వరుసగా ఏదో ఒక రంగంలో రెండు అవార్డులు కైవసం చేసుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ సీత దామోదర్ మాట్లాడుతూ ఖాతాదారులు, వాటాదారులు తమ బ్యాంకుపై ఉంచిన నమ్మకంతోనే తాము ఈ విజయాలను సొంతం చేసుకుంటున్నామన్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంవత్సరం అధునాతన క్యాష్ క్రెడిట్ యంత్రాలను పోచంపల్లి, దేవరకొండ, హాలియా, చండూరు బ్రాంచిల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకు వ్యాపారం రూ.174 కోట్లు దాటిందని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ కర్నాటి బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు సూరపల్లి రమేశ్, భోగ విజయ్, చిక్క కృష్ణ, పున్న లక్ష్మీనారాయణ, ఎల్లస్వామి, కవిత, అర్చన, వేణు, బస్వయ్య, పోచంపల్లి అర్బన్ బ్యాంకు మేనేజర్ మధుసూదన్ ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...