విద్యుత్ కార్మికులకు అండగా ఉంటాం


Sun,September 22, 2019 12:21 AM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: తెలంగాణ సాధనోద్యమంలో విద్యుత్ కార్మికుల కృషి అనిర్వచనీయమని, ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే విద్యుత్ ఉద్యోగులను 35శాతం పీఆర్సీ ఇచ్చి, 23 వేల మంది కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను క్రమబద్దీకరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(టీఆర్‌వీఎస్‌కే) జిల్లా గౌరవాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ కాలనీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీఆర్‌వీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భవ్య ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ కార్మికుల అండగా ఉంటామన్నారు. కిందస్థాయి కార్మికులపై పైస్థాయి అధికారులైన ఏడీఈ, డీఈ, ఏఈలు వేధింపులకు పాల్పడుతున్నారని తెలిసిందన్నారు. త్వరలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిలతో కలిసి పై స్థాయి విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకు ముగింపు పలుకుతామన్నారు. విద్యుత్‌కార్మిక సంఘం 1104, 327 లకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. వాటితో ఇక కార్మికులకు పనిలేదన్నారు. కార్మికులకు ఏ అవసరం వచ్చినా టీఆర్‌వీఎస్‌కే అండగా ఉంటుందని వివరించారు. త్వరలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. ఏడాదికాలంలోనే టీఆర్‌ఎస్‌కేవీని ఏర్పాటు చేసి పీఈఎల్ పెద్దకందుకూరులో గుర్తింపు ఎన్నికల్లో బంఫర్ మెజార్టీతో గెలుపొందామని వివరించారు. త్వరలో పీఈఎల్ కార్మికులకు మంచి అగ్రిమెంట్‌ను అందివ్వబోతున్నామని చెప్పారు.

సమస్యల పరిష్కారానికి కృషి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి విద్యుత్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న ఏకైక కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘమేనని టీఆర్‌వీఎస్‌కే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ చెప్పారు. సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 35 శాతం పీఆర్సీతోపాటు ఆర్టీజన్ కార్మికుల క్రమబద్ధ్దీకరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి టీర్‌వీఎస్‌కే ప్రధాన భూమిక పోషించిందని స్పష్టం చేశారు. విద్యుత్ విభాగంలో ఎన్నో కార్మిక సంఘాలున్నా.. వారు సంపాందించుకునే పనిలోనే ఉన్నారే తప్ప, కార్మికుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. త్వరలో ఆర్టీజన్ కార్మికులను క్రమబద్ధ్దీకరణకు సంబంధించిన గైడ్‌లైన్స్ వెలువడనున్నాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కంపెనీ కార్యదర్శి పి. కరెంట్‌రావు అధ్యక్షతన వహించగా టీఆర్‌వీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, యాదగిరిగుట్ట జడ్పీటీసీ తోటకూరి అనురాధాబీరయ్య, కంపెనీ అధ్యక్షుడు బండారు భాస్కర్, కార్మిక నాయకులు బత్తిని కృష్ణగౌడ్, అబ్బాస్, అక్బర్, పెంట శ్రీనివాస్, సలీం, రాందాసు, సోమరాజు, విష్ణు, వెంకట్‌రెడ్డి, ఇబ్రహీం, నర్సింహ, రవి, గిరి తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...