అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‌ను మంజూరు చేయండి


Sun,September 22, 2019 12:21 AM

-రవాణాశాఖ మంత్రికి ప్రభుత్వ విప్ వినతి
యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: ఆలేరు పట్టణానికి అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మంత్రి పువ్వడ అజయ్‌కుమార్‌ను కోరారు. శనివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ హాల్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదంలో ఏటా వందల మంది చనిపోవడంతో పాటు చాలావరకు వికలాంగులుగా మారుతున్నారని తెలిపారు. ఇందులో 80 నుంచి 85 శాతం నిర్లక్ష్య డ్రైవింగే కారణమని సర్వేలు చెబుతున్నాయని మంత్రికి వివరించారు. ఈ పరిస్థితి మారాలంటే డ్రైవింగ్‌లో సరైన శిక్షణ అవసరమని తెలిపారు. ఆలేరు పట్టణంలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు కావాల్సిన ప్రభుత్వ స్థలం కేటాయించినట్లు మంత్రికి వివరించారు. ఈ స్కూల్ వల్ల యాదాద్రిభువనగిరి జిల్లాతోపాటు, జనగామ జిల్లా వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. వినతి పత్రం స్వీకరించిన మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ విప్ తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...