వైద్య పరీక్షలు చేయాలి


Sun,September 22, 2019 12:21 AM

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి
భువనగిరి, నమస్తే తెలంగాణ : సీజనల్ జ్వరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలవారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు రక్త పరీక్షలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. శనివారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బతుకమ్మ చీరల పంపిణీ, సీజనల్ వ్యాధులు, రెవెన్యూ, అటవీ భూముల సర్వే, యూరియా పంపిణీ తదితర అంశాలపై సూచనలు చేశారు.

ఈనెల 23 నుంచి శాసనసభ నియోజకవర్గాల కేంద్రాల్లో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి యూరియాను జిల్లాలకు పంపామని వీటిని సక్రమంగా అందించేలా చూడాలన్నారు. వర్షాలు కురిసి నీటి లభ్యత ఉన్నందునా పంటల దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనితారామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రమేశ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్‌రెడ్డి, అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...