రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


Sun,September 22, 2019 12:22 AM

రామన్నపేట : మండలంలోని వెల్లంకి, ఇంధ్రపాలనగరం, ఉన్నత పాఠశాలకు చెందిన విధ్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 20న ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన పోటీల్లో వెల్లంకి ఉన్నత పాఠశాలకు చెందిన బండమీది గోపి ,రాపోలు లింగస్వామి, కావలి వెంకటేశం అండర్-17 బాలుర హాకీ పోటీలకు , బలికె స్వేత , జిడ్డు కవిత , నర్ర మానసలు అండర్- 17 బాలికల హాకీ పోటీలకు అదే విధంగా అండర్ -14బాలుర హకీ పోటీలకు నార్లకొండ రాజు, వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఇంద్రపాలనగరం ఉన్నత పాఠశాలలకు చెందిన ఇద్దరు విద్యార్థ్ధులు 50 కేజీల విభాగంలో మాదం. సాయికుమార్ ,77 కేజీల విభాగంలో పూస. సాయిరాజ్‌లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థ్ధులను ,వ్యాయామ ఉపాధ్యాయులు శోభ, శీనయ్యలను ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పాండులు ,సర్పంచ్‌లు ఎడ్ల మహేందర్‌రెడ్డి, కాటెపల్లి సిద్దమ్మ, ఏంపీటీసీలు తిమ్మాపురం మహేందర్ రెడ్డి, పూస బాలమణిలు అభినందించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...