ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం


Sun,September 22, 2019 12:25 AM

-జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్
-భువనగిరిలో పోషణ్ అభియాన్ అవగాహన ర్యాలీ ప్రారంభం

భువనగిరి అర్బన్: పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన పోషణ్ అభియాన్ అవగాహన ర్యాలీని కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రావి భద్రారెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారం లోపాన్ని తగ్గించడం కోసం వైద్యశాఖ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మహిళల్లో వచ్చే వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు.

అవగాహన కల్పించాలి..
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వచ్చే వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. మహిళల్లో రక్త హీనత సమస్యను అధిగమించేందుకు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండటానికి అంగన్‌వాడీ కార్యక్తలు కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రదర్శించిన పండ్లను మహిళలకు అందజేశారు. అంతకుముందు సమావేశంలో మహిళ శిశుసంక్షేమ జిల్లా చైర్మన్ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, వలిగొండ జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా వైద్యశాఖాధికారులు డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ రామయ్య, జిల్లా క్షేత్ర ప్రచారాధికారి కోటేశ్వర్‌రావు, పోషణ్ అభియాన్ జిల్లా కో-ఆర్డినేటర్ అనితారెడ్డి, సీడీపీవోలు శైలజ, స్వరూప, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...