రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


Sun,September 22, 2019 11:46 PM

తుర్కపల్లి : రెండు బైకులు ఢీకొన్న ఘటనలో మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం బొమ్మలరామారం మండలంలోని పెద్దపర్వతాపూర్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన దేశపాండ్య భాను(30), బబ్బూరి నాగరాజులు కలిసి మోటర్ సైకిల్‌పై హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బొమ్మలరామారం మండలంలోని పెద్దపర్వతాపూర్ శివారు ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన భానుతోపాటు నాగరాజులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ భాను మృతి చెందాడు. మరోవైపు బబ్బూరి నాగరాజు అనే యువకుడు భానుని బైక్‌పై హైదరాబాద్‌కు తీసుకెళ్లడం వల్లే రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయినట్టు బంధువులు ఆరోపించారు. భాను మృతదేహంతో నాగరాజు ఇంటి ముందు బంధువులు ధర్నా నిర్వహించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...