ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు


Sun,September 22, 2019 11:46 PM

చౌటుప్పల్ రూరల్ : ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని దామెర గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన పెరుమాండ్ల లక్ష్మయ్య(60) ద్విచక్ర వాహనంపై తన వ్యవసాయం బావి వద్దకు వెళ్తుండగా వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి తలకు, చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని మైరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...