క్రీడల్లో ప్రావీణ్యం పొందాలి


Sun,September 22, 2019 11:47 PM

భువనగిరి అర్బన్ : క్రీడల్లో ప్రావీణ్యం పొంది.. ఉన్నత స్థాయిలో స్థిరపడాలని భువనగిరి పట్టణ సీఐ ఎం.సురేందర్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో అండర్-14, 16, 18, 20 విభాగాల్లో పాల్గొనే అథ్లెటిక్ జట్టు ఎంపికలో భాగంగా ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా అథ్లెటిక్ బాలబాలికల ఎంపిక టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన జట్లు అక్టోబర్ నెల 12,13 తేదీల్లో సూర్యాపేటలో జరిగే 6వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్ క్రీడల్లో పాల్గొంటారని అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ విద్య, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు తునికి విజయసాగర్, వేణుమాధవ్, శ్రీనివాస్, స్టాలిన్, బాబు, వినోద్, సుందరి, ఉపేందర్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...