పాడి రైతుల సంక్షేమానికి కృషి


Sun,September 22, 2019 11:47 PM

రాజాపేట : పాడి రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని మదర్‌డెయిరీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్‌రాంరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులు మదర్‌డెయిరీ కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాడి రైతులకు బోనస్ అందించేందుకు ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన బడ్జెట్‌లో రూ.74 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. పాడి రైతులకు చేసిన సేవలను గుర్తించి మరోసారి మదర్‌డెయిరీ డైరెక్టర్‌గా అవకాశం కల్పించిన ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్ రైతు విభాగం మండలాధ్యక్షుడు కొన్యాల మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల నాయకులు ముకుందారెడ్డి, బాలరాజురెడ్డి, కోరుకొప్పుల బాబు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...