తగ్గిన వరద ప్రవాహం


Sun,September 22, 2019 11:48 PM

నందికొండ : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వర ద ప్రవాహం తగ్గడంతో సాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్ల ద్వా రా నీటి విడుదలను శనివారం రాత్రి 1 గంట నుంచి నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వ చ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోను అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. అల్మటీ, నారాయణపూర్, జూరాల నుంచి శ్రీశైలంకు ఇన్‌ఫ్లో తగ్గడంతో శ్రీశైలం క్రస్టు గేట్ల ను బంద్ చేసి జల విద్యుత్ కేంద్రాల ద్వారా సాగర్‌కు 48696 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సా గర్ రిజర్వాయర్‌కు వస్తున్న వరద నీటితో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చే పడుతూ, ఎడమ, కుడి, వరద, ఎస్‌ఎల్‌బీసీ కాల్వ ద్వా రా 48,969 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...