పొల్లాచి దారుణం

Fri,March 15, 2019 01:15 AM

తమిళనాడులోని పొల్లాచిలో అమాయక మహిళలను మభ్యపెట్టి లోబరుచుకొని, వారితో అశ్లీల చిత్రాలు తీస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తున్న దారుణం దిగ్భ్రాంతికరంగా ఉన్నది. ఒక కళాశాల విద్యార్థినితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న ముఠా ఆమెను మంచి మాటలు చెప్పి కారులో ఎక్కించుకొని వివస్త్రను చేసి, వీడియో తీసింది. ఆ వీడియో చిత్రాలను బయటపెడుతామని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఆమెనుంచి డబ్బు గుంజడంతో పాటు, అత్యాచారాలకు పాల్పడటం కొంతకాలం సాగింది. ఆమె ఇక భరించలేక తమ కుటుంబసభ్యులకు తెలుపడంతో ఆమె సోదరుడు దుండగులకు దేహశుద్ధి చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు - ఒక యువతి ఫిర్యాదు చేయడంతో, ఇదేరీతిలో యాభై నుంచి వంద మంది వరకు మహిళలు అత్యాచారాలకు గురైనట్టు వెల్లడైంది. దాదాపు ఏడేండ్లుగా ఈ దారుణ కృత్యాలు సాగిస్తున్నట్టు ముఠా సభ్యులు తెలిపారు. వీరి సెల్‌ఫోన్స్‌లో మరికొందరు యువతులపై సాగించిన అత్యాచారాలు ఉన్నట్టు వెల్లడైంది. ఈ దారుణం బయటపడిన తర్వాత పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తీరు, ప్రభుత్వ ఉపేక్షిస్తున్న ట్టు విమర్శలకు గురైంది. ఈ ముఠాలో ఒక అన్నాడీఎంకే కార్యకర్త కూడా ఉన్నాడు. దీంతో రాజకీయపక్షాలు రంగంలోకి దిగాయి. మరోవైపు విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ప్రదర్శనలు సాగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయాలు పెంచుకొని ప్రేమలో పడటం, పెండ్లిళ్లకు సిద్ధపడటం ఈ మధ్య తరచూ కనిపిస్తున్నది. ఇట్లా మోసపోయిన వారిలో మగవారూ ఉన్నారు.

పొల్లాచి అత్యాచారాల ఉదంతం అత్యంత దారుణమైందనేది కనబడుతూనే ఉన్నది. కానీ ఈ ఘోరాల పట్ల జాతీ యమీడియా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బహిరంగ విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మిత్రపక్షం అధికారంలో ఉండటం వల్లనే జాతీయ మీడియా స్పందించలేదనే అభిప్రాయానికి తావేర్పడుతున్నది. పొల్లాచి మారుమూల ప్రాంతం. కనీసం రాష్ట్ర రాజధాని కూడా కాదు. దీంతో పట్టించుకున్నవారు లేరు. సమాజం చాలా మెతకగా స్పందించింది. విద్యార్థిలోకం ముందుకువచ్చి ఆందోళనలకు దిగడంతో రాజకీయపార్టీల్లో చలనం కనిపిస్తున్నది.


ముక్కుమొహం తెలువ ని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, కలిసి తిరుగడం ప్రమాదకరమని యువత గ్రహించాలె. కొన్ని ముఠాలు వలపన్ని అత్యాచారాలు జరిపినప్పుడు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నప్పుడు యువతులు ధైర్యంగా కుటుంబసభ్యులకు ఈ విషయం తెలుపాలె. కుటుంబసభ్యులు కూడా ధైర్యంగా వ్యవహరించాలె. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ఈ విషయంలో యువతను చైతన్యపరుచాలె. పొల్లాచి కేసులో పోలీసులు మొదట దుండగులను కనీసం కస్టడీలోకి కూడా తీసుకోలేదని ఆరోపణలున్నాయి. బాధిత మహిళల పేర్ల ను బయటపెట్టకూడదు. కానీ పోలీసులు ఆమె పేరు, కళాశాల, నివాస ప్రాంతాన్ని బయటపెట్టా రు. ప్రభుత్వ జీవో కూడా వివరాలను పేర్కొన్న ది. బాధితురాలి పేరు బయటపడటం, ఇదొక పెద్ద ఆందోళనగా మారడంతో, మిగతా బాధితు లు ఫిర్యాదు చేయడానికి ముందుకురావడం లేదు. ఈ ముఠా మాయలో పడిన మహిళల్లో విద్యార్థులే కాదు, అధ్యాపకులు, ఇతర ఉద్యోగినులు కూడా ఉండటం ఆశ్చర్యకరం. మహిళలపై సాగుతున్న అత్యాచారాలు చాలావరకు బయట కు రావు. సమాజం హీనంగా చూస్తుందనే బాధ తో మహిళలు బయటికి చెప్పుకోరు. ఈ ముఠా మూలంగా అనేకమంది మోసపోయినట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా దుండగుల సెల్‌ఫోన్స్ నుంచి పోలీసులకు లభించినట్టు వెల్లడైంది. అయినా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం లేదు. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు వాటిపట్ల మనుషుల్లో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం కావ డం సహజం. మానవతా హృదయం ఉంటే బాధితులు నా వాళ్ళా, పరాయిలా అనేది చూసుకొని పక్షపాతంతో వ్యవహరించరు. కానీ రాజకీయపార్టీలు, మీడియా కంటతడి పెట్టడానికి కూడా కొన్ని లెక్కలుంటాయనడానికి ఈ పొల్లాచి కేసు తాజా ఉదాహరణ.

ఢిల్లీలో ఒక జాతీయపార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యాచారాల పట్ల మీడియాలో భారీగానే చోటు దొరికింది. అత్యాచారాలు రాజకీయ అస్ర్తాలయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలతో ఉర్రూతలూగాయి. అధికారం ఉన్న పార్టీ ఓడిపోయి, ప్రభుత్వం మారడంతో మీడియా ఇక ఆ వైపు చూడటం లేదు. పొల్లాచి అత్యాచారాల ఉదంతం అత్యంత దారుణమైందనేది కనబడుతూనే ఉన్నది. కానీ ఈ ఘోరాల పట్ల జాతీ యమీడియా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బహిరంగ విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మిత్రపక్షం అధికారంలో ఉండటం వల్లనే జాతీయ మీడియా స్పందించలేదనే అభిప్రాయానికి తావేర్పడుతున్నది. పొల్లాచి మారుమూల ప్రాంతం. కనీసం రాష్ట్ర రాజధాని కూడా కాదు. దీంతో పట్టించుకున్నవారు లేరు. సమాజం చాలా మెతకగా స్పందించింది. విద్యార్థిలోకం ముందుకువచ్చి ఆందోళనలకు దిగడంతో రాజకీయపార్టీల్లో చలనం కనిపిస్తున్నది. లోక్‌సభతోపాటు, తమిళనాడులోనే 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీనిని రాజకీయాస్త్రంగా వాడుకుంటున్నాయి. స్వయంగా బాధితురాలు దీనిని రాజకీయం గా వాడుకోవద్దని, ఈ ప్రచారం తమకు మరింత మనోవేదనను కలిగిస్తుందని విజ్ఞప్తి చేయవలసి వచ్చింది. ఒక ముఠా లేదా కొన్ని ముఠాలు మహిళలను పథకం ప్రకారం లోబరుచుకొని, బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధిస్తున్న తీరు, ఇటువంటి వాటిని అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్త్రతలపై అర్థవంతమైన చర్చ జరుగడం అవసరం. తల్లిదండ్రులతో పాటు బాధ్యతాయుత స్థానాలలో ఉన్నవారం తా ఆలోచించవలసిన విషయమిది.

403
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles