విషాహారానికి విజ్ఞానమే విరుగుడు

Thu,March 21, 2019 11:26 PM

ఈ మధ్య జరిపిన ఒక సర్వేలో ప్రతి భారతీయుడు 0.35 మి.గ్రా. పురుగుల మందు తింటున్నాడని తెలిసిం ది. ఇది తెలిసి కొంత, తెలియక కొంత జరుగుతున్నది. పండ్లు, కూరగాయలు, ఇతర ధాన్యాలు ఎక్కువ దిగుబడి రావాలని రైతు లు క్రిమిసంహారక మందుల వాడకం మొదలుపెట్టారు. ధాన్యం, పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడుగకుండా తిన్నప్పుడు వాటితోపాటు కొంత పెస్టిసైడ్‌ను కూడా మనం ఆహారంతో పాటు తీసుకుంటున్నాం. ద్రాక్ష పండ్లు రోడ్డు మీద కొనుక్కొని, కడుగకుండా అలానే తినే వాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం. టమాటాలు, కందలు, దుంపలు, పచ్చిశనగ మొదలైనవెన్నో కడుగకుండానే, వండకుండానే తినే అలవాటు చాలామందికి ఉంటుంది. పచ్చికూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిదే అయి నా, వాటిమీద చల్లిన రసాయనాల విషయం మరిచిపోవడం ప్రమాదం. ఇలా నేరుగానే కాకుండా ఈ పెస్టిసైడ్స్ పరోక్షంగా కూడా మన శరీరానికి చేరే అవకాశాలు ఉన్నాయి. పంట దిగుబడి ఎలాగున్నా రైతులు చల్లే రసాయనాలు భూమిలో కలిసిపోతాయి. పదేళ్ల పాటు ఉంటాయి. వర్షాకాలంలో ఆ మట్టి కొట్టుకునిపోతే రసాయనాలు కూడా కొట్టుకునిపోతాయి. ఈ విధంగా కుంటలు, చెరువులు, నదులు రసాయనాలతో కలుషితం అవుతున్నాయి. ఆ రసాయనాలు జలచరాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పంట పొలా ల నుంచి కొట్టుకువచ్చిన పెస్టిసైడ్స్ చేపల శరీరాల్లోకి, చేపల నుంచి మని షి శరీరంలోకి చేరుతున్నాయి. విష రసాయనా లు కూడా ఒక జంతువు నుంచి మరో జంతువుకు చేరుతున్నాయి. ఉదాహరణకు పీతలు, నత్తలు, పురుగులు, కీటకాలు-ఉసిళ్లు మొదలైనవి తినే పేద ప్రజానీకం, వాటితోపాటు వాటి శరీరాల్లోకి ఇంకిపోయి ఉన్న విష రసాయనాల్ని కూడా తింటున్నారు.

పంట దిగుబడి ఎలాగున్నా రైతులు చల్లే రసనాయనాలు భూమిలో కలిసిపోతాయి. పదేళ్ల పాటు ఉంటాయి. వర్షాకాలంలో ఆ మట్టి కొట్టుకునిపోతే రసాయనాలు కూడా కొట్టుకునిపోతాయి. ఈ విధంగా కుంటలు, చెరువులు, నదులు రసాయనాలతో కలుషితం అవుతున్నాయి. ఆ రసాయనాలు జలచరాలపై ప్రభావం చూపుతాయి.


ఫలితంగా జీర్ణ సంబంధమైన, రక్త సంబంధమైన అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఈ విషయంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మైసూర్, లూధియానా, కోల్‌కతా, ఢిల్లీ వంటి మహానగరాల్లోని మార్కెట్ల నుంచి శాస్త్రజ్ఞులు ఆహార పదార్థాల నమూనాలను తీసి పరిశీలించారు. ఎంతో విషపూరితమైన, రోగకారకాలైన పెస్టిసైడ్స్ అవశేషాలు వాటిలో ఉన్నాయని తెలుసుకున్నారు. బెంజైన్ హెగ్జాక్లోరైడ్ (BHC) మలాథియాన్‌లు ఎక్కువ శాతంలో ఉన్నాయి. వీటితోపాటు డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ (D.D.T) పరాథియాన్‌లు కూడా ఎక్కువగానే ఉన్నా యి. మాంసం, చేపలు, పాలు, కూరగాయలు, పప్పుధాన్యాలు మొదలైన ఆహార నమూనాలన్నింటా పెస్టిసైడ్ అవశేషాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వం డీడీటీ వాడకాన్ని చాలా కాలం కిందనే నిషేధించింది. అవి వాడినప్పుడు భూమిలో పేరుకుపోయిన దాని అవశేషాలు ఇప్పటికీ దుష్ప్రభావాల్ని చూపుతున్నాయి. కర్ణాటకలోని కొన్ని గ్రామాల్లో వయోభేదం లేకుండా అందరికీ కీళ్ల నొప్పులున్నాయి. అది శాస్త్రవేత్తలకు పరిశోధక విషయమైంది. తీరా పరిశీలిస్తే వారి శరీరాల్లో ఎండ్రిన్, డీడీటీల అవశేషాలున్నాయని తేలింది. వాళ్లంతా పీతలు తింటారని తెలుసుకుని, అక్కడి పీతల్ని పరిశీలించారు. వాటి శరీరాల్లో కూడా ఎండ్రిన్, డీడీటీలు ఎక్కువగా ఉన్నాయి. అవి పెరిగే నీటిలో అవే విష రసాయనాలు దండిగా ఉన్నాయి. అక్కడి క్వీన్ మేరీ దవాఖానకు సంబంధించిన వైద్య పరిశోధకులు ఈ విషయంపై కొంత అధ్యయనం చేశారు. లక్నోలోని పారిశ్రామిక విష రసాయనాల పరిశోధనా సంస్థ వారు మరింత విలువైన సమాచారం అందించారు. వారు స్త్రీ గర్భంలోని తల్లికి-పిండ దశలో ఉన్న శిశువుకూ మధ్య గల వారధి మాలి-జరాయువు (PLACE NTA)లో కూడా డీడీటీ, బీహెచ్‌సీ అవశేషాలున్నట్టు కనుగొన్నారు.

గాలి, నీరు, ఆహారం అన్నీ విషతుల్యమైపోతున్న తరుణంలో సామాన్య జనం కాలుష్యాలను ఎదుర్కొనే విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. రాబోయే తరాలకు శుభ్రమైన గాలి, నీరు, ఆహారం అందించాలన్న బాధ్యతతో మసులుకోవాలి. అంతేగాని ఏ మత గ్రంథమో చదువుకుంటూ జీవితం నుంచి పలాయనం చిత్తగించే పనులు ఏ రకంగా ఉపయోగపడుతాయి? కాలుష్యం పీలుస్తూ,తాగుతూ, కాలుష్యాలే తింటూ యోగా చేసుకుంటే నో, ధ్యానం చేసుకుంటేనో, ఏ దేవుడి భజనో, ప్రార్థనో చేసుకుంటూ కూర్చుంటే దండెత్తి వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయా? ఆలోచించాల్సిన అవసరం ఉంది.


అంటే శిశువు పుట్టకముందే విష రసాయనాలు తమ ప్రతాపం చూపుతున్నాయన్న మాట! అంటే శిశువులు పుట్టుకతోనే కాలుష్యాలతో పుడుతున్నారు. ఈ కాలుష్యాల ప్రభావం వల్ల శిశువులు అంగవైకల్యంతో పుడి తే, లేదా శరీర ధర్మరీత్యా ఏవైనా లోపాలతో గనుక పుడితే.. జనం అస లు విషయం గ్రహించరు. కొందరు పూజారుల దగ్గరికి, ముల్లా, ఫాదర్‌ల దగ్గరికి జ్యోతిష్యుల దగ్గరికి పరిగెత్తుతారు. వాళ్లు జనంలోని మూఢనమ్మకాల ఆధారంగా వారిని పూర్వ జన్మలోని పాపాల దగ్గరికి, శాంతి పూజల దగ్గరికీ పరిగెత్తించి డబ్బు లాగుతారు. ఇదీ జరుగుతున్నది. భూమిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానాన్ని మనిషి కాపాడుకోగలిగితే ఎంతో బాగుంటుంది. ఈ క్రిమిసంహారక మందుల వల్ల కలిగే దుష్ఫలితాలు అనేకం. ఈ డీడీటీ అవశేషాలు మెదడును మొద్దుబారుస్తాయి. క్యాన్సర్‌కు దారి తీస్తా యి. సెక్స్ హార్మోన్లపై దుష్ప్రభావాలు చూపుతాయి. కాలేయాన్ని చెడగొడుతా యి. ఈ పెస్టిసైడ్స్-ఇన్‌సెక్టిసైడ్స్‌గా, నిమాటీ సైడ్స్‌గా రకరకాలుగా ఉంటా యి. ముఖ్యంగా క్లోరినేటెడ్ హైడ్రో కార్బన్-ఇన్‌సెక్టిసైడ్ చాలా ప్రమాదం. క్లోరేడేన్, హెప్టాక్లోర్, డైయాల్డ్రిన్, ఆల్‌డ్రిన్, ఎండ్రిన్ వంటివి లేదా డైయాజినన్, గుథియాన్, ట్రైథియాన్, ఎథియాన్, డిసిస్టోన్ వంటి వి ఎన్నయినా చెప్పుకోవచ్చు. విష రసాయనాలతో ఉన్న చిక్కేమిటంటే డోసు తక్కువైతే పనిచేయవు. సరిపోతే, ఇతర ప్రమాదాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉంటాయి. ఎక్కువైతే అసలుకే మోసం. ఇన్‌సెక్టిసైడ్స్ ఎక్కువ మోతాదులో వాడినప్పుడు పంటలు పూర్తిగా నాశనమైన సందర్భాలు కూడా ఉన్నాయి. పంట దిగుబడి చూసు కుంటే, మరోవైపు అవి మొత్తం ప్రాణకోటి మీదే విష ప్రభావం చూపుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా పనిచేయగల (ANTI DOSE) మరేదో మందు కనుక్కునే దాకా రైతులు, సామాన్య పౌరులు జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. విష రసాయనాల అవశేషాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రజలు అవి తెలుసుకుని, అవగాహన పెంచుకుని మసలుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రసాయనాల అవశేషాలు లేకుండా ధాన్యం, కూరగాయలు, పండ్లు శుభ్రం చేసుకొని వినియోగించాలి. వీలైనంత వర కు కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ కొవ్వు లో సులభంగా కరుగుతాయి. మనం తినే నూనెలు, ఇతర కొవ్వు పదార్థాల్లో పెస్టిసైడ్స్ కరిగి అవి మన శరీర కణాల్లో ఇంకిపోతాయి. ఫలితంగా శరీరం వ్యాధులకు నిలయమవుతుంది. అందువల్ల కొవ్వు పదార్థాలు తినడం తగ్గిస్తే, విష రసాయనాలు తగ్గించినట్లే. మరో ముఖ్య విషయమేమంటే ఈ విష రసాయనాలు నీటిలో కరుగవు. మంచి నీరు తగినం త తీసుకోవడం వల్ల విష రసాయనాలు కొట్టుకుపోతాయి తప్ప, శరీరంలో ఇంకిపోవడానికి ఆస్కారం ఉండదు. సంక్లిష్టమైపోతున్న ఆధునిక జీవనంలో, మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో సమస్య తలెత్తుతూనే ఉంటున్నది. పరిశోధకులు నిత్యం పరిష్కారాలు కనుగొంటూనే ఉన్నారు. ప్రజలే వివేకవంతులు కావాలి. ధర్మం పేరిట అధర్మ ప్రచారం చేస్తున్న వారిని బహిష్కరించాలి. ఆత్మప్రబోధం, ఆధ్యాత్మికత పేరుతో బురిడీ కొట్టించే బాబాల్ని, మత బోధకుల్ని దూరం పెట్టాలి. ఆధునిక మానవుడి జీవితం సుఖవంతంగా గడువడానికి సైన్స్ మాత్రమే ఉపయోగపడుతుందన్నది గ్రహిస్తే మంచిది. గాలి, నీరు, ఆహారం అన్నీ విషతుల్యమైపోతున్న తరుణంలో సామాన్య జనం కాలుష్యాలను ఎదుర్కొనే విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. రాబోయే తరాలకు శుభ్రమైన గాలి, నీరు, ఆహారం అందించాలన్న బాధ్యతతో మసులుకోవాలి. అంతేగాని ఏ మత గ్రంథమో చదువుకుంటూ జీవితం నుంచి పలాయనం చిత్తగించే పనులు ఏ రకంగా ఉపయోగపడుతాయి? కాలుష్యం పీలుస్తూ,తాగుతూ, కాలుష్యాలే తింటూ యోగా చేసుకుంటే నో, ధ్యానం చేసుకుంటేనో, ఏ దేవుడి భజనో, ప్రార్థనో చేసుకుంటూ కూర్చుంటే దండెత్తి వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయా? ఆలోచించాల్సిన అవసరం ఉంది.
Devaraju-Maharaju
సహజసిద్ధంగా అందరికీ అందాల్సిన మంచి ఆహారం అందడం లేదు. గనుకనే ఇటీవల కాలంలో సింథటిక్ ఆహారం మార్కెట్‌లోకి వచ్చింది. ఆపిల్ పండ్లు తాజాగా కనబడటానికి వాక్స్ కోటింగ్ ఇస్తున్నారు. ఇలాంటివి తినడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలకు గురికావాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల గురించి ఏ ధర్మ ప్రబోధకుడూ మాట్లాడడు! మనం ఇప్పుడు ఈ కాలానికి అవసరమైన అంశాలు, నేటి మానవీయ విలువల గురించిన విషయాలు ఆలోచించాలి. మూఢ నమ్మకాల గంతలు విప్పేస్తే గాని, మన కళ్లు ఈ ఆధునిక సమాజాన్ని చూడలేవు. అందువల్ల ఒకవైపు ఆహారాన్ని, మరోవైపు ఆలోచనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది.
(వ్యాసకర్త: సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్)

330
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles