ఇదే అదను వచించెదను..

Sat,March 23, 2019 12:50 AM

మొన్నటి వరకు సి.బి.ఐ, ఇన్‌కమ్‌టాక్స్ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ, కొంతవరకు న్యాయస్థానాలు వగైరా కేంద్రపాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతున్నా యి. ఇంతవరకు మచ్చలేని భారత సైన్యం గూడ నిన్నటి నుంచి పాలకుల రాజకీయలబ్ధి కోసం ఉపయోగపడుతున్నదని అన్పిస్తున్నది. ఇది అత్యంత శోచనీయ పరిణామం.కేంద్రం లో అధికారం చేపట్టిన తరువాత మోదీజీ ఈ ఐదేండ్ల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయల వ్యయంతో శత్రు, మిత్ర అన్న తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నిట పర్యటించారు. ఇంత చేసినా, ఆయన అంతర్జాతీయ దౌత్యనీతి ఫలితం ఏమిటి? అమెరికా పాకిస్తాన్‌తో తన సంబంధాలను తెంచుకోదు; రష్యా పాకిస్తాన్‌తో తన దోస్తీని పెంచుకుంటున్నది. పాకిస్తాన్ చాలా సంయమనంతో వ్యవహరిస్తున్న శాంతికాముక దేశమని కమ్యూనిస్టు చైనా మూడురోజుల కిందట ప్రకటించింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మధుర ప్రసంగం అంతా విన్న తరువాత ఇస్లామిక్ దేశాల సమావేశం పాకిస్థాన్ వైఖరిని సమర్థిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇదీ మోదీజీ దౌత్యనీతి పర్యవసానం. అన్నివిధాల సమస్యల వలయంలో చిక్కుకున్న సమకాలిక భారతానికి కేసీఆర్ మార్గదర్శకత్వం అత్యవసరమైన అదను ఇదీ.

Prabhakar-Raoo
ఇదే అదను లెనిన్ కథను రచించెదను నేను, లెనిన్ బ్రతు కు జనం కొరకు.. అంటూ శ్రీశ్రీ ఎనభై ఏండ్ల కిందట సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ స్థాపకుడు, ఆధునిక మానవాళి చరిత్రలో ఒక వినూత్న అధ్యాయ ప్రారంభకుడు లెనిన్ విప్లవ జీవితగాథను ఒక సుదీర్ఘ కవితగా, ఒక మనోజ్ఞకావ్యంగా రచించారు. లెనిన్ కథను, గర్జించు రష్యా గాండ్రించు రష్యా గీతాలను రచించడానికి శ్రీశ్రీకి స్ఫూర్తినిచ్చిన అదనయిన కాలం అది. సైద్ధాంతికంగా ఒకవంక అమెరికాను, మరోవంక ఫాసిస్టు జర్మనీ కూటమిని ఎదుర్కొంటూ సోవియట్ యూనియన్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు శ్రీశ్రీ ఈ గీతాలు రాశారు.ప్రజలసిరి యీ శ్రీశ్రీ, ప్రజాక్రోధ శ్రీశ్రీ యీ శ్రీశ్రీ.. అని కాళోజీ అన్నాడు.

అదనుఅన్నది అతి ముఖ్యం. మన రైతులకు అదను పరిజ్ఞానం చాలా ఎక్కువ. పంచాంగాలు చదవకున్నా సేద్యాని కి అవసరమైన కార్తెల సంగతి రైతులకు బాగా తెలుసు. రోహిణి వెళ్లగానే రైతు విత్తనాలు వేయడానికి అది అదను అనుకుంటాడు. అదను దాటకుండా సకాలంలో తగిన చర్యలకు నడుం బిగించేవాడు మహాజ్ఞాని. మార్చి17న కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైతే జాతీయస్థాయిలో ఒక రాజకీయ పార్టీని స్థాపించే సంకల్పాన్ని వెల్లడించారు. ఒక నూతన రాజకీయ పార్టీ జాతీయస్థాయిలో స్థాపితం కావడానికి ఇదే అదను అని తలచారు. కేసీఆర్ కీలెరిగి వాత పెట్టగల సమర్థ నాయకుడు. కేసీఆర్ రాజకీయ విజ్ఞతకు, సమయజ్ఞతకు,స్ఫూర్తిదాయక నేతృత్వానికి సహస్ర నమోవాకాలు. స్వతంత్ర భారత రాజకీయ చరిత్రను రాగద్వేషాలకు అతీతంగా పరిశీలించి, విశ్లేషించినట్లయితే ఇంతవరకు జాతీయపార్టీలుగా చెలామణి అవుతున్న పార్టీలు దేశ సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనాయని స్పష్టమవుతుంది.1947తో పోల్చిచూస్తే ఎక్కడ వేసిన గొం గళి అక్కడే ఉంది.

యాభై ఏండ్లకు మించిన కాంగ్రెస్ పాలనలో ఉత్పన్నమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సరిహద్దు సమస్యలు.. బీజేపీ పదేండ్ల పాలనలో మరింత క్లిష్ట స్వరూపం ధరించాయి. మోదీ గత ఐదేం డ్ల పాలనలో ఆర్థిక, సామాజిక సమస్యలు తీవ్ర స్వరూపం ధరించడంతో పాటు కొత్తగా మరో సమస్య అసహనం విజృంభించి జాతీయ సమైక్యతకు, దేశ సమగ్రతకు, భిన్నత్వంలో ఏకత్వానికి భంగకరంగా పరిణమించాయి. ఐదేండ్ల కిందట మోదీ వాగ్దానాలను నమ్మిన దేశప్రజలకు మిగిలినది నిరాశా నిస్పృహలే. ఐదేండ్ల అనంతరం జాతీయ, అంతర్జాతీయరంగాల్లో మోదీ వైఫల్యాలు దేశప్రజలను వెక్కిరిస్తున్నాయి. ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్యకాలంలో ఓటర్ల సంఖ్య దేశమంతట కోట్లలో పెరుగుతున్నది కాని గుణాత్మక పరివర్తన సంభవించడం లేదు. పాలకవర్గాలు మారడం ఒక్కటే జరుగుతున్న మార్పు. స్వప్రయోజనాలకు, స్వార్థానికి, రాజకీయలబ్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన పార్టీలివి. దేశ ప్రయోజనాలను, ప్రజల సమస్యల పరిష్కారాన్ని విస్మరించిన పాలకవర్గాలు ఇవి. భారతజాతికి వినూత్న మార్గనిర్దేశం చేయవలసిన నాయకత్వం రంగం మీదికి రావలసిన అదను ఇది. మరోసారి మరో తెలంగా ణ బిడ్డ దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో తరుణోపా యం చూపించవలసిన సమయం ఆసన్నమైంది.

ప్రధాని మోదీ, ఆయన సహచరులు, అనుచరులు గత ఐదేండ్ల అమూ ల్య కాలాన్ని మాటలతో వృథా చేశారని చెప్పక తప్పదు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడగానే (2014 మే నెల చివరి వారంలో) ప్రధాని మోదీ వరుసగా అయిదారు పర్యాయాలు కశ్మీరు వెళ్లివచ్చారు. ఆర్.ఎస్.ఎస్. కశ్మీరులో అడుగుపెట్టకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భారత ప్రథమ ఉపప్రధాని, దేశ వ్యవహారాల మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ భావించారు. ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధసంస్థలు (అప్పటి జనసంఫ్‌ు వంటి వి) వాటి ఐరన్‌లెగ్ మోపితే కశ్మీరు పరిస్థితి విషమిస్తుందని, పాకిస్థాన్ జోక్యం హెచ్చుతుందని పటేల్ దృఢంగా విశ్వసించారు. ఇదే జరిగింది, పటేల్ భయం నిజమైంది. కశ్మీరులో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మీద ఒత్తిడి తెచ్చి పీడీపీ కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత.

2015లో జమ్మూకశ్మీరు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కశ్మీరు లోయలో బీజేపీ అన్నిస్థానాల్లో చిత్తుగా ఓడిపోయింది. అయినా, దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటుచేసి బీజేపీ పెత్తనం చేయడం, ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేయాలని బీజేపీ డిమాండు చేయ డం కశ్మీరీలకు ఆగ్రహం కలిగించింది. బీజేపీ చర్యలకు ప్రతిక్రియగా కశ్మీరులో మతోన్మాద టెర్రరిజం గతంలో ఎన్నడూలేనంతగా విజృంభించిం ది. కశ్మీరీ యువతీ యువకులు, విద్యార్థులు బజార్లలో రాళ్లు రువ్వుతూ భారత సైన్యంతో, ఇతర సాయుధ బలగాలతో పోరాడుతున్నారు. ఎన్‌కౌంటర్లలో మరణించిన టెర్రిస్టుల అంత్యక్రియలలో కశ్మీరీలు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. కశ్మీరియత్, ఇన్సానియత్, జంహూరియత్ మాటలు మంటకలిశాయి. ఈ పరిస్థితిలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సైనిక స్థావరంపై, జమ్మూలోని యురీ సైనిక శిబిరంపై పాక్ టెర్రిస్టుల దాడులు జరిగాయి. అయినా, మోదీ ప్రభుత్వం, ఆయన భద్రతా సలహాదారులు జాగరూకత వహించలేదు. నోట్ల రద్దుతో, సర్జికల్ స్ట్రయిక్స్‌తో పాక్ టెర్రిస్టుల అంతం జరిగిందని మోదీ భారత ప్రజలను భ్రమింపజేశారు. పుల్వామా దాడి జరుగకపోతే బాల్‌కోట్‌పై భారత వైమానిక దాడి కి, మోదీ యుద్ధ విజేతగా ప్రచారం పొందడానికి అవకాశం ఉంటుం దా? బాలాకోట్ దాడిలో జైషే టెర్రిస్టులు నాలుగువందల మంది మరణించారని ప్రకటించి బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు మిఠాయీలు పంచారు. బాలాకోట్ దాడిలో అక్కడి భవనాలపై కనీసం చిల్లులైనా పడలేదని వాషింగ్టన్‌పోస్ట్, న్యూయార్క్‌టైమ్స్, రాయిటర్ రాశాయి! ఏది సత్యం, ఏదసత్యం, ఓ మహాత్మా, ఓ మహర్షీ అంటూ ఓ కవి వాపోయాడు.

మొన్నటి వరకు సి.బి.ఐ, ఇన్‌కమ్‌టాక్స్ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ, కొంతవరకు న్యాయస్థానాలు వగైరా కేంద్రపాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతున్నా యి. ఇంతవరకు మచ్చలేని భారత సైన్యం గూడ నిన్నటి నుంచి పాలకు ల రాజకీయ లబ్ధి కోసం ఉపయోగపడుతున్నదని అన్పిస్తున్నది. ఇది అత్యంత శోచనీయ పరిణామం. రాజకీయ రాక్షస రతిక్రీడలో ఏ క్షణాన ఎవరు బలి అవుతారో చెప్పలేం. భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ కాకముందు చాలామంచి వాడన్న పేరున్న వేణుగోపాల్ ఇప్పుడు సుప్రీంకోర్టులో రోజుకోమాట మాట్లాడక తప్పడం లేదు. రాఫెల్ విమానాల కొనుగోలు ఫైలును రక్షణమంత్రిత్వ శాఖ నుంచి ఎవరో దొంగిలించి ఎంగిలి చేశారని అటార్నీ జనరల్ ఓరోజు కోర్టులో చెప్పారు. దొంగిలించలేదని ఆయన మరునాడే సుప్రీంకోర్టులో చెప్పవలసి వచ్చింది. ఫైలునే రక్షించలేని వాళ్లు దేశాన్ని రక్షిస్తారా అన్నది సామాన్యుల సందేహం.

మోదీజీ ఐదేండ్ల పాలనలో దేశ ప్రజలు విస్మరించలేని అపశ్రుతులు ఎన్నో, ఎన్నె న్నో. గత సంవత్సర ప్రారంభంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు నలుగురు (ఇప్పటి ప్రధాన న్యాయమూర్తితో సహా) రోడ్డు మీదికొచ్చి తమ గోడు విన్పించిన ఉదంతాన్ని, నక్కలు చింపిన విస్తరిగా మారిన సిబిఐ దుస్థితిని, మోదీజీ ప్రభుత్వానికి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మధ్య చెలరేగిన రగడను దేశ ప్రజలు ఎన్నడూ మరిచిపోలేరు. మోడీజీపాలనలో ఇద్దరు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్లు, దేశ ఆర్థిక సలహాదా రు, నీతి అయోగ్ చైర్మన్ ఔట్. మోదీజీ హయాములో మన ఆర్థిక వ్యవస్థ తీవ్ర రుగ్మత పాలైందనడానికి ఈ ఔట్లు ప్రబల నిదర్శనాలు-పత్రికా స్వాతంత్య్రాన్ని కబళించడానికి బ్రిటిష్ పాలన నాటి అధికార రహస్యాల చట్టాన్ని ప్రయోగించబోతున్నట్లు మోదీజీ ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే ప్రకటించింది.

జమ్మూకశ్మీరు రాష్ట్ర శాసనసభ 1999 లో ఆమోదించిన అటానమీ తీర్మానాన్ని అప్పటి వాజ్‌పాయ్ బీజేపీ ప్రభుత్వం ఆమోదించినా, నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం సర్కారియా కమిషన్ కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై చేసిన విలువైన సిఫారసులను అమలు చేసి నా, మోదీజీ టీమ్ ఇండియా నినాదం బూటకం కాకపోయినా ఈరోజు కేసీఆర్ తమ అమూల్య నాయకత్వాన్ని ఫెడరల్ ఫ్రంట్ కోసం వినియోగించవలసిన అవసరం ఉండకపోయేది. కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత మోదీజీ ఈ ఐదేండ్ల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయల వ్యయంతో శత్రు, మిత్ర అన్న తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నిట పర్యటించారు. ఇంత చేసినా, ఆయన అంతర్జాతీయ దౌత్యనీతి ఫలితం ఏమిటి? అమెరికా పాకిస్తాన్‌తో తన సంబంధాలను తెంచుకో దు; రష్యా పాకిస్తాన్‌తో తన దోస్తీని పెంచుకుంటున్నది. పాకిస్తాన్ చాలా సంయమనంతో వ్యవహరిస్తున్న శాంతికాముక దేశమని కమ్యూనిస్టు చైనా మూడురోజుల కిందట ప్రకటించింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మధుర ప్రసంగం అంతా విన్న తరువాత ఇస్లామిక్ దేశా ల సమావేశం పాకిస్థాన్ వైఖరిని సమర్థిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించిం ది. ఇదీ మోదీజీ దౌత్యనీతి పర్యవసానం. అన్నివిధాల సమస్యల వలయంలో చిక్కుకున్న సమకాలిక భారతానికి కేసీఆర్ మార్గదర్శకత్వం అత్యవసరమైన అదను ఇదీ.

412
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles