అంతా నిర్దోషులే!

Sat,March 23, 2019 12:52 AM

సంఝౌతా తీర్పు వెలువడిన వెంటనే పాక్‌లోని భారత రాయబారిని పిలిచి పాక్ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. ఎన్‌ఐఏ లాంటి దర్యాప్తు సంస్థకు అంతర్జాతీయంగా గౌరవ ప్రతిష్ఠలున్నాయి. నేర పరిశోధనలు, తీర్పులపై రాజకీయాల ప్రభావం ప్రమాదకరం. నిష్పాక్షికమైన దర్యాప్తులు, నిఖార్సైన తీర్పులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య సౌధంగా భారత్ తన కీర్తిని నిలుపుకోవాలి. ప్రజలకు రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం పెంపొందించాలి.


పేలుళ్లు వాస్తవం. పదుల సంఖ్యలో ప్రాణాలుపోయింది వాస్తవం. కానీ దోషులే లేరు! ఇదీ సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసు తీర్పు సారాంశం! పన్నెండేండ్ల కిందట సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో ముద్దాయిలుగా ఉన్న ప్రధాన నిందితుడు అసిమానందతో పాటు మరో ముగ్గురు నిర్దోషులుగా విడుదలయ్యారు. ప్రాసిక్యూషన్ వారు సరియైన సాక్ష్యాధారాలు చూపెట్టలేకపోయినందున కేసును కొట్టి వేస్తూ, నిందితులందర్నీ విడుదల చేస్తున్నట్లు ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఎప్పటిలాగే సుదీర్ఘ విచారణ తర్వాత కూడా తమకు న్యాయం జరుగలేదని బాధితులు వాపోతున్నారు. ఎట్టకేలకు తమకు న్యాయం దక్కిందని నిందితులుగా పరిగణింపబడినవారు చెబుతున్నారు. 2007 ఫిబ్రవరిలో పంజాబ్‌లోని పానిపట్ దగ్గర ఢిల్లీ నుంచి పాకిస్థాన్‌లోని లాహోర్ వెళ్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో భీకర పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 68 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువ శాతం పాకిస్థానీయులు కాగా, కొంతమంది భారతీయులూ ఉన్నారు. ఎప్పటిలాగే ఈ పేలుళ్లకు కారకులుగా ముస్లిం ఉగ్రవాద గ్రూపులనే అనుమానించారు. కానీ కాలక్రమంలో ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ విచారణ లో పేలుళ్లకు హిందూ తీవ్రవాద గ్రూపు సభ్యులు కారకులుగా తేలింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగి అసిమానందతో పాటు మరికొందరు అరెస్టు అయ్యారు. ఇంతకుముందు జరిగిన మాలే గాం, అజ్మీర్ దర్గా, హైదరాబాద్‌లోని మక్కామసీదు పేలుళ్లకు హిందూ అతివాదులే బాధ్యులని ఎన్‌ఐఏ ధృవీకరించింది. అందుకు బాధ్యుడు గా, ప్రధాన నిందితుడిగా నవకుమార్ సర్కార్ అలియాస్ అసిమానందతో పాటు మరికొంత మందిని అరెస్టు చేసింది. ఈ అన్ని కేసుల్లోనూ అసిమానంద నిర్దోషిగా విడుదల కావటం గమనార్హం.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో అసిమానంద నిర్దోషిగా విడుదల కావటంపై బాధితుల్లోనే కాదు, ప్రజాస్వామికవాదుల్లో కూడా పెద వి విరుపు కనిపిస్తున్నది. దేశంలో గత దశాబ్దకాలంగా హిందు మెజారిటీవాదంతో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈతీర్పు ఊహిం చిందే అన్నంతగా భావనలు వ్యక్తం కావటం లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థకు మంచి పరిణా మం కాబోదు. ముంబాయి ముట్టడి, పార్లమెంటుపై దాడి, పఠాన్‌కోట్ ఏర్‌బేస్‌పై టెర్రరిస్టుల దాడి తర్వాత దేశంలో ఏమూల పేలుళ్ల శబ్దం వినిపించినా అందరిచూపులు ఒకవైపే మరల డం సహజమైపోయింది. ఎక్కడ పేలుళ్లు సంభవించినా ముస్లిం ఉగ్రవాద గ్రూపుల దుశ్చర్యగా భావిస్తూ ఎందరో ముస్లిం యువకులను అనుమానితులుగా అరెస్టు చేయటం పరిపాటైంది. ఆ క్రమంలోనే 2006లో 37 మంది మరణానికి కారణమైన మాలేగాం పేలుళ్ల కేసులో 9మంది ముస్లిం యువకులను మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం అరెస్టు చేసింది. ఆ తర్వాత సీబీఐ కూడా దాన్నే నిర్ధారించింది. 2007 మేలో జరిగిన మక్కామసీదు పేలుళ్ల కేసులో తొమ్మిది మంది చనిపోయారు. ఇదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన అజ్మీర్ దర్గా పేలుళ్లలో ముగ్గురు చనిపోయారు. ఈ కేసులన్నింటిలో ముస్లిం యువకులనే అనుమానితులుగా అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టడంతో ఈ పేలుళ్లన్నింటికీ హిందు తీవ్రవాద గ్రూపు కారణమని తేలటంతో దేశమంతా నెవ్వెరపోయింది.

మన న్యాయస్థానాల్లో ఏండ్ల తరబడి విచారణలు కొనసాగటం, తీర్పులు వెలువడటం రివాజే. ఈ సుదీర్ఘ విచారణ కారణంగా నిజమైన నేరస్తులు తప్పించుకుంటున్నట్లే, కేవలం అనుమానితులుగా ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న దుస్థితి ఉన్నది. ఎన్‌ఐఏ చేపట్టిన 187 కేసుల్లో న్యాయస్థానాల్లో 95శాతం కేసుల్లో నేరం రుజువై దోషులకు శిక్షలు ఖరారయ్యాయి. అయితే ఇప్పుడు ఎన్‌ఐఏ దర్యాప్తు సంస్థగా చేపట్టిన కేసులో ముద్దాయిలంతా నిర్దోషులుగా తేలటం జాతీయ దర్యా ప్తు సంస్థ పనితీరుపైనే నీలినీడలు కమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. సంఝౌతా కేసులో సాక్షులంతా ఎదురుతిరిగారు. ప్రధానసాక్షిగా ఉన్న సునీల్ జోషి అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యా డు. మరికొందరు పాకిస్థాన్ పౌరులుగా కోర్టుకు హాజరు కాలేకపోయారు. 2010లో ప్రత్యేకకోర్టు ఎదుట అసిమానంద సుదీర్ఘ ఒప్పుకోలు ప్రకటన చేశాడు. అక్షరధామ్ ఘటనకు ప్రతీకారంగా 2006-08 మధ్య దాడులకు వ్యూహరచన చేసినట్లు కోర్టులో ఒప్పుకోలు ప్రకటనలు ఇచ్చాడు. చివరికి అతడు కూడా నిర్బంధంలో చేసిన ఒప్పుకోలు ప్రకటన కాబట్టి అది చెల్లనేరదని ఎదురుతిరిగాడు. ఏదైతేనేమి సాక్ష్యాధారాలు లేక సంఝౌతా కేసులో నిందితులంతా నిర్దోషులుగా తేలా రు. మరోవైపు దేశంలో జరిగిన ప్రతి ఉగ్రవాద చర్యకూ పాక్‌వైపే వేలెత్తి చూపితే, పాక్ కూడా సంఝౌతా సంగతేమిటని ఎదురు ప్రశ్నించే స్థితి ఏర్పడింది. సంఝౌతా తీర్పు వెలువడిన వెంటనే పాక్‌లోని భారత రాయబారిని పిలిచి పాక్ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. ఎన్‌ఐఏ లాంటి దర్యాప్తు సంస్థకు అంతర్జాతీయంగా గౌరవ ప్రతిష్ఠలున్నాయి. నేర పరిశోధనలు, తీర్పులపై రాజకీయాల ప్రభావం ప్రమాదకరం. నిష్పాక్షికమైన దర్యాప్తులు, నిఖార్సైన తీర్పులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య సౌధంగా భారత్ తన కీర్తిని నిలుపుకోవాలి. ప్రజలకు రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం పెంపొందించాలి.

334
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles